ల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయన్లుగా సుకుమార్ తెరక్కించిన మూవీ ‘పుష్ప‌- ది రైజ్‘. పాన్ ఇండియా మూవీగా తెరక్కిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతి చోటా కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా  హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఒకేసారి ఐదు భాషల్లో విడుదలైన అల్లు అర్జున్ సినిమాగా ‘పుష్ప’ గుర్తింపు పొందింది. ఎర్ర చందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం హిందీలోనే ఏకంగా రూ.100 కోట్లు సంపాదించింది.


తాజాగా రష్యాలో ‘పుష్ప’ విడుదల


తాజాగా ‘పుష్ప’ సినిమా రష్యాలోనూ విడుదల అయ్యింది. దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మందన్న సహా ఇతర సినిమా బృందం మాస్కోలో పర్యటించి ప్రమోషన్స్ లో పాల్గొన్నది. అక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మంచి వసూళ్లను సాధిస్తోంది.  మరోవైపు ‘పుష్ప-2’ సినిమాను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలి పార్ట్ మంచి విజయాన్ని అందుకోవడంతో రెండో భాగాన్ని అద్భుతంగా రూపొందించాలనే యోచనలో ఉన్నారు. ఈ మేరకు కథలో మార్పు చేర్పులు చేస్తున్నట్లు తెలిసింది. ‘పుష్ప 2’ షూటింగ్‌కు సంబంధించి ఆగస్టులో పూజా కార్యక్రమాలు జరిగాయి.  


సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ‘పుష్ప-2’ డైలాగ్


ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’కు సంబంధించిన డైలాగ్ ఇదే అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. “అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం” ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా ‘పుష్ప-2’కు సంబంధించి ఓ డైలాగ్ లీక్ చేశాడు. తన సోద‌రుడు అల్లు శిరీష్ న‌టించిన `ఊర్వశివో రాక్ష‌సివో` సినిమా వేడుకలో పాల్గొని ఓ డైలాగ్ చెప్పాడు. పుష్ప- 1లో 'తగ్గేదే లే' అయితే, పుష్ప 2లో 'అసలు తగ్గేదే లే' అవుతుంది అన్నాడు. అటు ‘పుష్ప-2’సినిమాలో అల్లు అర్జున్ ఫ‌స్ట్ లుక్‌ ను సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రోజెక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.









 Read Also: ఆ షర్ట్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ - వైసీపీకి కౌంటర్?