ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో 'తగ్గేదేలే' అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. 'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది. 


మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పార్ట్ 2 రాసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అందుకే సెట్స్ పైకి తీసుకెళ్లడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్  మొదలుపెట్టకుండానే బాలీవుడ్ కి చెందిన కొన్ని కార్పోరేట్ కంపెనీలు 'పుష్ప'తో డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నాయి. 


ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న అల్లు అర్జున్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సెకండ్ పార్ట్ కి గాను బన్నీ రూ.90 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. బిజినెస్ లో వాటాతో కలిపి ఇంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారట. ఆశించిన దానికంటే ఎక్కువగా బిజినెస్ జరిగితే బన్నీకి ఎలా లేదన్నా రూ.100 కోట్లు రెమ్యునరేషన్ గా వచ్చే ఛాన్స్ ఉంది. 


'పుష్ప ది రైజ్' కోసం రూ.18 కోట్ల పారితోషికం తీసుకున్న దర్శకుడు సుకుమార్ ఇప్పుడు మాత్రం రూ.45 నుంచి రూ.50 కోట్లు తీసుకోబోతున్నారట. అంటే కేవలం హీరో, దర్శకుడు పారితోషికాలకే రూ.140 కోట్లు అవుతుందన్నమాట. మరో 50, 75 కోట్లు నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్ కి సరిపోతాయి. మొత్తం అన్నీ కలుపుకొని ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్ లో చిత్రీకరించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.   


Also Read: ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని చితకబాదారు - సాయిపల్లవి కామెంట్స్


Also Read: నితిన్‌కు డ్యాన్స్ రాదు, నేనే నేర్పించా! ఈ రోజు నన్నే అవమానించాడు - అమ్మ రాజశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్