తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇష్యూస్ వస్తే పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కడం చాలా తక్కువ. ఇరు వర్గాలు, ఎవరో ఒక పెద్ద దగ్గర కూర్చుని సెటిల్‌మెంట్ చేసుకోవడం వంటి వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకనో, 'లైగర్' ఫ్లాప్ తర్వాత ఫైనాన్స్ మేటర్‌లో అటువంటి సెటిల్‌మెంట్ జరగలేదు. పూరి జగన్నాథ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ కేసు 'లైగర్'కు సంబంధించినది అయినా... పూరి తర్వాత సినిమాలపై దాని ప్రభావం పడేలా ఉందని ఇండస్ట్రీ టాక్. 


పూరిని బ్యాన్ చేయాలనుకుంటున్న ఫైనాన్షియర్లు?
No Financial Support To Puri Jagannath? : 'లైగర్' డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ జి శోభన్ మీద పూరి జగన్నాథ్ కేసు పెట్టారు. అగ్రిమెంట్ ప్రకారం తాను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు తన నుంచి వసూలు చేసే విధంగా ఎగ్జిబిటర్లు, బయ్యర్లతో తన ఇంటి దగ్గర ధర్నాకు ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. కేసు ఇద్దరిపై పెట్టినా... దాని ఎఫెక్ట్ చాలా ఉందనేది ఇండస్ట్రీ టాక్. 


ఇవాళ శోభన్ మీద కేసు పెట్టారని, రాబోయే రోజుల్లో మనపై కూడా కేసులు పెడితే ఏం చేస్తామని తెలుగు సినిమాలకు ఫైనాన్స్ చేసే వారంతా ఆలోచనలో పడ్డారట. పైకి చెప్పుకున్నా... 'లైగర్' గొడవలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయట. ఆ చర్చల్లో టాలీవుడ్ ఫైనాన్షియర్లు అందరూ కలిసి పూరి జగన్నాథ్ తీయబోయే సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదని అనధికారికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఫిలిం నగర్ గుసగుస.    


పూరి నెక్స్ట్ ఏంటి?
హిందీ హీరోతోనా...?
నిజం చెప్పాలంటే... ఇప్పుడు పూరి జగన్నాథ్ చేతిలో సినిమా ఏదీ లేదు. 'లైగర్' విడుదలకు ముందు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో 'జన గణ మణ' స్టార్ట్ చేశారు. 'లైగర్' డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ ఆ సినిమా పక్కన పెట్టారు. దాంతో పూరి చేతిలో సినిమా లేకుండా పోయింది. 'జన గణ మణ'ను హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు, ఆయనకు స్టోరీ నేరేట్ చేయడానికి ముంబై వెళ్లినట్టు సమాచారం. మధ్యలో సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో 'ఉరి' సినిమా చేసిన విక్కీ కౌశల్ పేరు కూడా వినబడుతోంది. 



హిందీ హీరోతో పూరి జగన్నాథ్ సినిమా ఓకే అయితే టాలీవుడ్ ఫైనాన్షియర్లతో ప్రస్తుతానికి అవసరం లేదు. అక్కడ ఎవరో ఒకరు ఉంటారు. తెలుగు హీరోతో చేయాల్సి వస్తే పెద్దలు ఎవరో ఒకరు మళ్ళీ జోక్యం చేసుకుని పూరికి, తెలుగు సినిమా ఫైనాన్షియర్లకు మధ్య సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఉంది.    


Also Read : ఆలీ హీరోగా, నరేష్ - పవిత్రా లోకేష్ జంటగా నటించిన 'అందరు బాగుండాలి అందులో నేనుండాలి' సినిమా ఎలా ఉందంటే?


ప్రస్తుతం పూరి ఇంటి వద్ద పోలీసులు!
పూరి జగన్నాథ్ కంప్లైంట్ తీసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు, ఆయన ఇంటి దగ్గర భద్రత కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్. రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తాను ప్రస్తుతం ముంబైలో ఉన్నానని, తాను ఇంటి దగ్గర లేని సమయంలో తన కుటుంబ సభ్యులకు డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా హాని తల పెట్టవచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. దాని ఫలితమే ఈ భద్రత.