టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా టికెట్ రేట్లు, ఓటీటీ రిలీజెస్, కార్మికుల వేతనాలు తదితర సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆగస్టు 1 నుంచి అన్ని సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు స్వయంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆయన మాట తప్పారు. వైజాగ్ పోర్టు ఏరియాలో తన సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారాయన. 


నిజానికి సినిమా షూటింగులు బంద్ చేయాలనే నిర్ణయంలో కీలకపాత్ర పోషించింది దిల్ రాజే. ఆయనే ఇప్పుడు షూటింగ్ కొనసాగించడంపై టాలీవుడ్ ఇండస్ట్రీ ఫైర్ అవుతోంది. దీనిపై స్పందించిన దిల్ రాజు ఒక లాజిక్ పాయింట్ చెప్పారు. తన నిర్మాణంలో విజయ్, వంశీ కలిసి చేస్తోన్న 'వారసుడు' సినిమా తమిళ సినిమా కిందకు లెక్క వస్తుందని.. అందుకే షూటింగ్ ఆపలేదని వివరణ ఇచ్చారు. అది బైలింగ్యువల్ సినిమా కదా..? అని దిల్ రాజుని ప్రశ్నించగా.. షూటింగ్ తమిళంలో జరుగుతుందని తెలుగులోకి డబ్ మాత్రమే చేస్తారని చెప్పారు. తాను బంద్ పాటిస్తున్నాని.. అందుకే తెలుగు సినిమా షూటింగ్ లు ఏవీ చేయడం లేదని చెప్పుకొచ్చారు.


దిల్ రాజు మాట తప్పి ఇలా షూటింగ్స్ చేయడంపై టాలీవుడ్ నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. దిల్ రాజు యాక్షన్స్ ని తప్పుబట్టారు. 'తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్ని సినిమాల షూటింగ్స్ ఆపేయాలి. తమిళ్, కన్నడ, మలయాళం చేసుకోవచ్చని అంటున్నారు. అది తప్పు. డబ్బింగ్ సినిమాలైనా.. పని చేస్తుంది తెలుగు టెక్నీషియన్సే కదా..? ఇప్పుడు 16 సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయి. ఆపితే అన్ని సినిమాల షూటింగ్స్ ఆపండి. మాటిచ్చి ఇప్పుడు తప్పడం కరెక్ట్ కాదు.. దిల్ రాజు గారు మీకేమైనా షూటింగ్స్ ఉంటే వెంటనే ఆపండి. మీరు ఆపకపోతే చిన్న నిర్మాతలు కూడా ఎవరి షూటింగ్స్ వారు చేసుకుంటారు. చిన్నవాళ్లెప్పుడూ మాట దాటరు.. పెద్దవాళ్లే ఇలా చేస్తుంటారు' అంటూ మండిపడ్డారు. 


Also Read: ‘అబ్బా అబ్బా’ సాంగ్.. సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి




Also Read: హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్