‘18 పేజెస్’ సినిమా పాజిటీవ్ రివ్యూస్‌ను సొంతం చేసుకున్న సంతోషంలో ఆ మూవీ టీమ్ సంబరాలు చేసుకుంటోంది. తాజాగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్‌లు అనుపమా పరమేశ్వరన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ మూవీలోని ‘‘టైమివ్వు పిల్ల కొంచెం టైమివ్వు’’ పాటలోని సిగ్నేచర్ స్టెప్ వేసి ఆకట్టుకున్నారు. హీరో నిఖిల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. 


గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌పై నిర్మించిన ‘18 పేజేస్’ మూవీ డిసెంబరు 23న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేవు. ఈ మూవీలో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. అనుపమా నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. దర్శకుడు సుకుమార్ అందించిన కథకు ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. 






ట్రైలర్‌తోనే ఈ మూవీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. పైగా ‘కార్తికేయన్-2’ సక్సెస్‌తో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ జంట.. పూర్తిగా భిన్నమైన కథాంశంతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. దీంతో ప్రేక్షకులకు కూడా ఫ్రెష్ ఫీల్ కలిగింది. అయితే, టీజర్లో దాదాపు కథ చెప్పేసినట్లు కనిపిస్తుంది. కానీ, అసలు వేరేగా ఉంటుందనేది మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. 


'18 పేజెస్' ట్రైలర్ స్టార్టింగులో 'నీకు ఫేస్‌బుక్ లేదా?' అని నిఖిల్ అడుగుతాడు. 'లేదు' అని అనుపమా పరమేశ్వరన్ ఆన్సర్ ఇస్తుంది. ఆ ఒక్క సంభాషణలో స్టోరీ, కాన్సెప్ట్ ఏంటి? అనేది చెప్పేశారు. ఈ రోజుల్లో ఫేస్‌బుక్ లేని అమ్మాయి ఉంటుందా? అనే క్వశ్చన్ రావడం కామన్. అయితే, ఫేస్‌బుక్ లేకుండా ప్రేమలో పడితే ఎలా ఉంటుందో? అనే ఊహ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. 


Also Read: చికెన్ బిర్యానీ తిని, ప్లేట్ ఇచ్చి హ్యాపీగా కన్నుమూశారు - అంత్యక్రియలు 28న: రవిబాబు


ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని హీరోలో మొదలైన ఆసక్తి తర్వాత ప్రేమగా మారుతుంది. ప్రేమతో పాటు సినిమాలో యాక్షన్ కూడా ఉందని ట్రైలర్ ద్వారా చెప్పారు. ఇదొక ఎమోషనల్ లవ్ డ్రామా అని అర్థం అవుతోంది. 'ప్రేమించడానికి మనకి ఇక రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నాం? అంటే దానికి ఆన్సర్ ఉండకూడదు' అని అనుపమ చెప్పే మాట అందరినీ ఆకట్టుకుంటుంది.