టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తొలి పాన్ వరల్డ్ మూవీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంజనాద్రి అనే కాల్పనిక ప్రదేశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హను మాన్‌లా శక్తులు పొందిన సామాన్యుడు అంజనాద్రిని కాపాడుకోవడానికి ఏం చేశాడనే నేపథ్యంలో ఈ కథ ఉండబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజ్ అప్ డేట్ వచ్చింది.
సంక్రాంతి కానుకగా ‘హనుమాన్’ రిలీజ్
వాస్తవానికి ‘హనుమాన్’ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా, పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫ్రెష్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న విడుదలకానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో తేజ సజ్జ చేతిలో హనుమాన్ జెండాతో ఒక కొండపై నుండి మరొక కొండ మీదికి దూకడం కనిపిస్తుంది. హనుమాన్ మాదిరిగా సూపర్ పవర్స్ కలిగి ఉన్నట్లుగా తేజ సజ్జ ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వీఎఫ్‌ఎక్స్ కారణంగానే విడుదల ఆలస్యం
‘హనుమాన్’ సినిమా కోసం భారీగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ పనుల్లో జాప్యం కారణంగా మేకర్స్ విడుదలను పలుమార్లు వాయిదా వేశారు. ఈ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉంటాయని తాజాగా తెలిసింది. అత్యుత్తమ నాణ్యత గల VFXని అందించడానికి చిత్ర బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘హనుమాన్’ టీజర్‌కు ఊహించని స్పందన
వాస్తవానికి ‘హనుమాన్’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. అందుకే, అనుకున్నదాని కంటే మరికొంత మెరుగ్గా సినిమాను తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు, అద్భుతమైన అవుట్ పుట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమాలోని ఒక్కో అంశాన్ని ఒక్కో కంపెనీ వాళ్లు వీఎఫ్‌ఎక్స్ చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ కు చాలా సమయం పడుతుందన్నారు.
11 భాషల్లో ‘హనుమాన్’ సినిమా విడుదల
‘హనుమాన్’ చిత్రాన్ని పాన్ వరల్డ్ యూవీగా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏకంగా 11 భాషల్లో విడదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ సహా 11 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
Read Also: బ్లాక్ బస్టర్ ‘దసరా‘ కాంబోలో మరో సినిమా, హీరోయిన్‌గా కీర్తిని రిపీట్ చేస్తారా?