బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా సంతోషపడతారు. ప్రగ్యా జైస్వాల్‌కు ఆ సంతోషం ఎంతో ఎక్కువ సేపు నిలవలేదు. ఎందుకంటే... సల్మాన్ సరసన ఆమె నటించినా, ఆ సీన్లు ఫైనల్ కట్ నుంచి తీసేశారు. అయితే... ఇప్పుడు ప్రగ్యాకు తన పక్కన ఓ మ్యూజిక్ వీడియోలో నటించే అవకాశం ఇచ్చారు సల్మాన్.
చెల్లెలు భర్త ఆయుష్ శర్మతో కలిసి సల్మాన్ ఖాన్ నటించిన సినిమా 'అంతిమ్ : ద ఫైనల్ ట్రూత్'. అందులో సల్మాన్ సరసన కథానాయిక ఎవరూ ఉండరు. నిజం చెప్పాలంటే... తొలుత సల్మాన్ క్యారెక్టర్‌కు రొమాంటిక్ ట్రాక్ రాశారు. హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసి, కొన్ని రోజులు షూటింగ్ చేశారు. ఆ తర్వాత కథకు సూట్ అవ్వడం లేదని ప్రగ్యాకు చెప్పి తీసేశారు. అయితే... ఇప్పుడు ఆమెతో సాంగ్ చేశారు సల్మాన్ ఖాన్.
ప్రముఖ హిందీ గాయకుడు గురు రంధావా, సల్మాన్‌తో ప్రేమలో ఉందని ప్రచారం సాగిన లులియా వంటూర్ 'మై చాలా' అనే సాంగ్ పాడారు. ఆ పాటలో సల్మాన్ ఖాన్, ప్రగ్యా జైస్వాల్ నటించారు. ఈ నెల 22న సాంగ్ విడుదల కానుంది. ఈ పాటకు సల్మాన్ ఖాన్ నిర్మాత. 'అంతిమ్' సినిమాకు కూడా ఆయనే నిర్మాత. ఆ సినిమా కోసం తీసిన సీన్లు... ఈ పాటకు ఏమైనా వాడేశారని అంటారా?
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
Also Read: జనవరి 20 ఎపిసోడ్: తండ్రిని తల్లి దగ్గరకు పంపించేసి రిషి ఒంటరి కానున్నాడా... 'గుప్పెడంత మనసు' గురువారం ఎపిసోడ్...
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి