మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. మరో ఐదు రోజుల్లో ఆయన నటించిన 'గాడ్ ఫాదర్'(God Father) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీరయ్య', మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు వెంకీ కుడుముల సినిమా కూడా ఓకే చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని టాక్. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చిరు మరో సినిమా చేయబోతున్నారని సమాచారం. 


అది కూడా రీమేక్ అట. ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా మలయాళ 'లూసిఫర్' సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. 'భోళా శంకర్' సినిమా కూడా రీమేక్ కథ. ఇప్పుడు మరో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. నెట్ ఫ్లిక్స్ లో చూసిన ఒక స్పానిష్ సినిమా చిరుకి బాగా నచ్చిందట. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ బాధ్యత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకి ఇచ్చినట్లు సమాచారం. 


Prabhudeva to direct Megastar Chiranjeevi again: ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో 'శంకర్ దాదా జిందాబాద్' అనే సినిమా వచ్చింది. అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు మరోసారి ప్రభుదేవా డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి. ప్రభుదేవా స్క్రిప్ట్ వర్క్ గనుక చిరుకి నచ్చితే కచ్చితంగా ఆయన అవకాశం ఇస్తారు. ప్రభుదేవాతో చిరుకి స్పెషల్ బాండింగ్ ఉంది. చిరు నటించిన చాలా సినిమాలకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా పని చేశారు. 


అయితే దర్శకుడిగా ప్రభుదేవా నుంచి ఈ మధ్యకాలంలో సరైన సినిమా రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'రాధే' సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ప్రభుదేవాని నమ్మి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి. మరేం జరుగుతుందో చూడాలి!


'వాల్తేర్ వీరయ్య' అప్డేట్:


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో మొదలుపెట్టారు. ఇప్పటికే వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు విలేజ్ సీక్వెన్స్ ను రాజమండ్రిలో చిత్రీకరిస్తున్నారు.


కథ ప్రకారం.. చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  


Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?



Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?