ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా 'పుష్ప'. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
అలానే భారీగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి నేషనల్ స్టార్ ప్రభాస్ ను గెస్ట్ గా తీసుకురాబోతున్నారని సమాచారం. హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ అన్ని భాషల్లో ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన్ని గనుక సినిమా ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చేస్తే సినిమాకి మరింత బజ్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు.
మరి ప్రభాస్ ఓకే చెప్తారో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ.. రీసెంట్ గా 'రొమాంటిక్' సినిమా ప్రమోషన్స్ లో భాగమయ్యారు. మరి బన్నీ కోసం కూడా వీలు చూసుకొని వస్తారేమో.. ఈ ఈవెంట్ ను డిసెంబర్ 12న నిర్వహించాలనుకుంటున్నారు. వెన్యూ ఎక్కడనే విషయం తెలియాల్సివుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
అలానే స్పెషల్ సాంగ్ లో సమంత కనిపించనుంది. ప్రస్తుతం ఈ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగనున్నాయి. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Also Read: కాజల్ ని టార్గెట్ చేసిన సిరి, షణ్ముఖ్.. మరోసారి మానస్ పై మండిపడ్డ శ్రీరామ్..
Also Read: కొరటాల అదిరిపోయే స్టఫ్.. అందరి కళ్లు 'ఆచార్య'పైనే..
Also Read: ఇంటర్నేషనల్ సినిమాలో సమంత.. రానా సజెషనా..?
Also Read:పాయల్ బోల్డ్ వీడియో.. వెంటనే డిలీట్ చేసేసింది..
Also Read: 'రాధే శ్యామ్'లో రెండో సాంగ్ టీజర్ వచ్చింది... చూశారా?
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి