మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసినప్పుడు అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి. ఈ సినిమాను మొదలుపెట్టి రెండేళ్లు దాటిపోవడం, రిలీజ్ వాయిదా మీద వాయిదా పడడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లింది. అపజయం ఎరుగని డైరెక్టర్ కొరటాల.. పైగా రామ్ చరణ్ స్పెషల్ రోల్ అంటే ఏ రేంజ్ లో బజ్ ఉండాలి..? కానీ 'ఆచార్య' విషయంలో ఆశించిన రేంజ్ లో హైప్ రాలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మరోపక్క 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లానాయక్' లాంటి సినిమాల హడావిడి మామూలు లేదు. 


ఈ సినిమాల గురించి జనాలు మాట్లాడుకుంటున్నారే తప్ప 'ఆచార్య' ప్రస్తావన పెద్దగా లేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి దృష్టి 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్'ల మీదే పడింది. వేరే సినిమాల గురించి పట్టించుకోవడం లేదు. 'ఆచార్య' సినిమా కూడా అలానే అయిపొయింది. అయితే సడెన్ గా 'ఆచార్య' సినిమా రేసులోకి వచ్చేసింది. అది కూడా 'సిద్ధ' టీజర్ తో కావడం విశేషం. ఈ సినిమాలో రామ్ చరణ్ 'సిద్ధ' అనే పాత్రలో కనిపించనున్నారు. 


ఆ పాత్రను పరిచయం చేస్తూ.. ఆదివారం నాడు ఓ టీజర్ ను వదిలారు. నిజానికి ఈ టీజర్ పై కూడా సరైన బజ్ లేదు. మూడు రోజుల క్రితమే టీజర్ రిలీజ్ చేస్తారనుకుంటే ఊరించి ఊరించి ఆదివారం నాడు రిలీజ్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ముఖ్యంగా చిరుతని, చిరుత పిల్లని.. చిరంజీవి, రామ్ చరణ్ లతో పోలుస్తూ తీసిన లాస్ట్ షాట్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. 


ఇలాంటి సన్నివేశాలను థియేటర్లో చూస్తే ఈ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో చిరుత షాట్ గురించే మాట్లాడుకుంటున్నారు. మార్కెట్ వర్గాల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. టీజర్ నే ఇలా కట్ చేశారంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ కి సమయం ఉంది కాబట్టి ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. 


Also Read: ఇంటర్నేషనల్ సినిమాలో సమంత.. రానా సజెషనా..?


Also Read:పాయల్ బోల్డ్ వీడియో.. వెంటనే డిలీట్ చేసేసింది..


Also Read: 'రాధే శ్యామ్'లో రెండో సాంగ్ టీజర్ వచ్చింది... చూశారా?


Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!


Also Read: పుష్ప సెట్‌కు వ‌చ్చిన స‌మంత‌... అల్లు అర్జున్‌తో స్పెష‌ల్ సాంగ్ షురూ!


Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... గెస్ట్ కూడా! ఎప్పుడు? ఎక్కడ? అంటే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి