ప్రభాస్ (Prabhas) ప్రేమలో ఉన్నారా? 'ఆదిపురుష్'లో తనకు జోడీగా నటించిన కృతి సనన్ (Kriti Sanon) తో ఆయన డేటింగ్ చేస్తున్నారా? ఆ మధ్య హిందీ హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం చెలరేగింది. ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణం అయ్యాయి. ఆ తర్వాత అందులో నిజం లేదని కృతి సనన్ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి. అయినా ఆగలేదు. 


వరుణ్ ధావన్ కామెంట్ పక్కన పెడితే... అయోధ్యలో 'ఆదిపురుష్' (Adipurush) టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. అక్కడ ప్రభాస్ చెమట తుడుచుకోవడానికి ట్రై చేస్తే కృతి సనన్ తన చీర కొంగు అందించడం... ప్రభాస్ నడుస్తుంటే అతనికి కృతి సపోర్ట్ ఇవ్వడం వంటివి వైరల్ అయ్యాయి. అందువల్ల ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని కొందరు బలంగా నమ్మారు. 


ప్రభాస్, కృతి సనన్ రిలేషన్ గురించి జరుగుతున్న ప్రచారానికి తోడు తనను తాను క్రిటిక్ అని సోషల్ మీడియాలో ప్రకటించుకున్న ఉమైర్ సందు చేసిన లేటెస్ట్ ట్వీట్ మరింత వైరల్ అయ్యింది. వచ్చే వారం మాల్దీవుల్లో వాళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకోవడానికి రెడీ అయ్యారని ట్వీట్ చేశాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ ట్వీట్ గురించి డిస్కషన్. దాంతో ప్రభాస్ టీమ్ రియాక్ట్ అవ్వక తప్పలేదు. 


జస్ట్ ఫ్రెండ్స్... అది పుకారే!
ప్రభాస్ టీమ్ నిశ్చితార్థం అంటూ వచ్చిన వార్తలను కొట్టి పారేసింది. ''ప్రభాస్, కృతి సనన్ స్నేహితులు మాత్రమే. నిశ్చితార్థం వార్తలు నిజం కాదు. అదంతా వట్టి పుకారే'' అని ప్రభాస్ టీమ్ బాలీవుడ్ మీడియాతో పేర్కొంది.


Also Read : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?


వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్ అయిన తర్వాత కృతి సనన్ స్పందించారు. ''ఇది ప్రేమ కాదు... పీఆర్ (పబ్లిసిటీ స్టంట్) అంత కంటే కాదు'' అని ఆమె పేర్కొన్నారు.  అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేశారామె. ''మా తోడేలు (వరుణ్ ధావన్) రియాలిటీ షోలో కొంచెం హద్దులు దాటింది. సరదాగా చేసిన వ్యాఖ్యలు పుకార్లకు కారణం అయ్యాయి. ఎవరో ఒకరు నా పెళ్లి తేదీ వెల్లడించే ముందు నన్ను అసలు విషయం చెప్పనివ్వండి. అదంతా ఫేక్ న్యూస్'' అని కృతి పేర్కొన్నారు. హిందీలో భారీ సినిమాల్లో నటించే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఉన్నట్టు ప్రచారం చేయడం పబ్లిసిటీ స్టంట్ అని చెబుతుంటారు. అందులోనూ ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు కావడంతో కృతితో ప్రేమలో పడ్డారని, నిశ్చితార్థానికి రెడీ అయ్యారని వార్తలు రాగానే ప్రేక్షకుల అందరి దృష్టి వాళ్ళ మీద పడింది. 


రామ్ చరణ్ చెప్పిన రాణి ఎవరు?
హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులలో కూడా ప్రభాస్ ప్రేమ, పెళ్లి గురించి చాలా ఆసక్తి నెలకొంది. ఆ మధ్య నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్ 2'కు ప్రభాస్ వచ్చారు. అక్కడ కూడా కృతితో ప్రేమ గురించి టాపిక్ వచ్చింది. మేడమ్ ఏమీ లేదని చెప్పిందని ప్రభాస్ తెలిపారు. అయితే, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతాడంటూ రామ్ చరణ్ ఫోనులో హింట్ ఇవ్వడం, రాణీ గురించి అంటూ గోపీచంద్ చెప్పడంతో ప్రభాస్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. 


Also Read : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ