Prabhas Birthday - Project K Update : ప్రభాస్ అభిమానులు గుర్తున్నారు - 'ప్రాజెక్ట్ కె' దర్శకుడు నాగ్ అశ్విన్ హామీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ హామీ ఇచ్చారు. రేపు స్పెషల్ గా ఒకటి ప్లాన్ చేశామని చెప్పారు. ఆయన ఏమన్నారంటే...

Continues below advertisement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. భారతీయ బాక్సాఫీస్ 'బాహుబలి', వాళ్ళ అభిమాన కథానాయకుడి పుట్టినరోజు (Prabhas Birthday) రేపు. ఈ సందర్భంగా వాళ్ళను ఫుల్ ఖుషీ చేసే మాట ఒకటి దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. సో... సంబరాలు చేసుకోవడానికి ఫ్యాన్స్ అంతా రెడీ అవుతున్నారు.
 
'ప్రాజెక్ట్ కె' నుంచి సంథింగ్...
ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K Movie Update). టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రేపు సంథింగ్ స్పెషల్ రాబోతోంది. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. 

Continues below advertisement

సాధారణంగా హీరోల పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు నటిస్తున్న సినిమాల నుంచి స్పెషల్ అప్‌డేట్స్ వస్తుంటాయి. గత ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ 'ప్రాజెక్ట్ కె' అప్‌డేట్ అడిగితే 'రాధే శ్యామ్' విడుదల తర్వాతే అని నాగ్ అశ్విన్ తెలిపారు. అందుకని, ఈ ఏడాది 'అన్నా గుర్తు ఉన్నామా?' అని అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ కోట్ చేస్తూ ఓ అభిమాని అడిగితే... ''రేపు ఓ చిన్న అప్ డేట్ వస్తుంది'' అని రిప్లై ఇచ్చారు (Prabhas Birthday Special). 

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ (Deepika Padukone) జంటగా సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K Movie)లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజుకు ప్రీ లుక్ ఒకటి విడుదల చేశారు. అందులో అమితాబ్ చెయ్యి తప్ప ఏమీ లేదు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అటువంటిది ఏదో ఒకటి విడుదల చేస్తారేమో!? చూడాలి. ఎందుకంటే... విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కదా!  

Project K Release Date : వచ్చే ఏడాది జనవరిలో 'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ పూర్తి అవుతుందని 'సీతా రామం' విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడినప్పుడు  సి. అశ్వినీదత్ చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కొంత టైమ్ పడుతుందని... అక్టోబర్ 18, 2023న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయడం కుదరకపోతే 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు అశ్వినీదత్ వెల్లడించారు. 

Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్

హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపై రానటువంటి కథాంశంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోందని టాక్. 

Continues below advertisement
Sponsored Links by Taboola