ఒక్క ట్వీట్ ఎంత పని చేసింది? ఎక్కడో... దుబాయ్ దేశంలో ఉన్న ఎవరో ట్వీట్ చేస్తే ఇండియాలో సోషల్ మీడియా, స్టార్ హీరో ఫ్యాన్స్ అందరూ షేక్ అయ్యారు. తెలుగుతో పాటు ఇండియన్  ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే షాక్ అయిందనుకోండి. తెలుగులో 'వన్ నేనొక్కడినే', 'దోచేయ్' సినిమాల్లో నటించిన ఉత్తరాది కథానాయిక కృతి సనన్ (Kriti Sanon) తో ప్రభాస్ (Prabhas) నిజంగా ప్రేమలో ఉన్నాడా? - ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న ఇది. 


'ఆదిపురుష్'లో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని ముంబై మాట్లాడుతోంది. ఆ మధ్య ఓ టీవీ షోలోహిందీ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో కృతి ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎవరో చేసిన ట్వీట్ వైరల్ కావడంతో ప్రభాస్ టీమ్ అటువంటిది ఏమీ లేదని చెబుతోంది. అసలు, కృతి కంటే ముందు ప్రభాస్ ఎవరెవరితో ప్రేమలో ఉన్నాడు? అనేది కూడా డిస్కషన్ పాయింట్ అవుతోంది.


ప్రభాస్... అనుష్క...
ఆ ఫాలోయింగే వేరు!
కృతితో ప్రభాస్ ప్రేమ అని ప్రచారం మొదలు కాగానే... తెలుగు ప్రేక్షకులు షాక్ తిన్నారు. ఎందుకు అంటే... 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి : ది బిగినింగ్', 'బాహుబలి : ది కంక్లూజన్' సినిమాలకు మాత్రమే కాదు, ప్రభాస్ - అనుష్క జోడీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ప్రేమలో ఉన్నాయని ఫీలైన ప్రేక్షకులు ఎంతో మంది! సినిమాలతో మొదలైన పరిచయం పెళ్ళి పీటల వరకు దారి తీసిందని గుసగుసలు కూడా వినిపించాయి. అందువల్ల, కృతితో ప్రేమ అంటే తెలుగు జనాలు నమ్మలేదు. ఇప్పటికీ నమ్మడం లేదు. ప్రభాస్, అనుష్క పెళ్ళి చేసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. 


పూజా హెగ్డే...
ఏం జరిగింది?
'రాధే శ్యామ్' విడుదలకు ముందు సంగతి ఇది! ప్రచార కార్యక్రమాల్లో పూజా హెగ్డే (Pooja Hegde) చాలా తక్కువగా కనిపించారు. అంతకు ముందు ఇద్దరి మధ్య ఏదో జరిగిందని, ఒకరినొకరు చూసుకోవడానికి ఇష్టపడటం లేదని, షూటింగులో ఎడ మొహం పెడ మొహం కింద ఉన్నారని కామెంట్లు వచ్చాయి. అందుకు కారణం బ్రేకప్ అని గుసగుసలు ఉన్నారు. ఎవరు ప్రపోజ్ చేశారు? ఎవరు నో చెప్పారు? అనేది బయటకు రాలేదు కానీ గొడవ అయ్యిందని మాత్రం వినికిడి. 


కాజల్ అగర్వాల్...
ఇలియానా కూడా!
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాక ముందు కూడా లవ్ లైఫ్, రిలేషన్షిప్స్ గురించి తెలుగులో డిస్కషన్స్ జరిగాయి. ఆరడుగుల అందగాడు, బలమైన సినిమా నేపథ్యం, ఆస్తిపాస్తులు ఉన్నోడు, అన్నిటికి మించి మంచి మనసున్నోడు కావడంతో అందరి చూపు ప్రభాస్ మీద ఉంటుంది. కృతి సనన్, అనుష్క, పూజా హెగ్డేకి ముందు కాజల్ అగర్వాల్, ఇలియానాతో కూడా ప్రభాస్ ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపించాయి. 


Also Read : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?


'డార్లింగ్'లో ప్రభాస్, కాజల్ జంటగా నటించారు. అందులో వాళ్ళ జోడీ బావుంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా బావుంటాయి. ఆ సినిమా చేసేటప్పుడు సుమారు ఏడాదిన్నర సీక్రెట్ డేటింగ్ నడిచిందని గుసగుస. 'మున్నా'లో ప్రభాస్, ఇలియానా జంటగా నటించారు. ఆ సినిమా షూటింగులో, విడుదల తర్వాత కొన్నాళ్ళు వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనే టాక్ వినిపించింది. ఎప్పుడూ తన ప్రేమ గురించి బాహుబలి బయట పడింది లేదు. చిరునవ్వే అతని ముఖం మీద ఉంటుంది. ప్రేమ, పెళ్ళి ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉంటున్నారు. 


Also Read : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!