టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి ఇటీవల 'విరాటపర్వం' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా.. సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. నక్సల్స్ గురించి మాట్లాడింది. అదే సమయంలో అవతలి వారిని బాధపెట్టకూడదని.. అందరూ మంచి మనుషుల్లా ఉండాలని చెప్పింది. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారని.. మనం కూడా అలా చేయకూడదని.. బాధితుల గురించి ఆలోచించాలని చెప్పింది.
ఈ క్రమంలో కశ్మీర్ పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోరక్షకులను పోల్చింది సాయిపల్లవి. కశ్మీర్ లో పండిట్లను చంపడం మతపరమైన హింసే అయితే.. గోరక్షణ పేరుతో జరుగుతోంది కూడా అదేనని చెప్పింది. సాయిపల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో చాలా మంది ఆమెని ట్రోల్ చేస్తున్నారు. చరిత్ర తెలియకుండా.. ఇలాంటి కామెంట్స్ చేయకంటూ ఆమెపై మండిపడుతున్నారు.
ఇప్పుడు ఈ వివాదం మరింత సీరియస్ అయ్యేలా ఉంది. భజరంగ్‌దళ్ సభ్యులు సాయిపల్లవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఆమెపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అలానే సైబర్ క్రైమ్ ని కూడా ఆశ్రయించారు. ఉగ్రవాదులతో, గోరక్షకులను పోల్చడమేంటంటూ.. సాయిపల్లవిపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. మరి ఈ వివాదంపై సాయిపల్లవి స్పందింస్తుందో లేదో చూడాలి!
Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!