Police Arrest bouncer Antony in the Sandhya theater stampede incident: సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ స్టేట్ మెంట్ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రికార్డు చేస్తున్నారు. అదే సమయంలో పోలీసులు బయట ఈ ఘటనలో ఉన్న కీలక వ్యక్తుల్ని అరెస్టు చేస్తున్నారు. అసలు పోలీసుల మాట వినకుండా మొత్తం ధియేటర్ ను కంట్రోల్ చేసిన బౌన్సర్లపై దృష్టి పెట్టారు. బౌన్సర్ల టీంను లీడ్ చేసిన ఆంటోనిని పోలీసులు అరెస్టు చేశారు. 


అల్లు అర్జున్ ఎక్కడ ఔట్ డోర్ ప్రోగ్రామ్ ఉన్నా ఆంటోనీ తన టీమ్ బౌన్సర్లతో వెళ్లి క్రౌడ్ ను కంట్రోల్ చేస్తారని తెలుస్తోంది. ఆ రోజున సంధ్యా ధియేటర్ కు కనీసం యాభై నుంచి అరవై మంది బౌన్సర్ల టీమ్ తో ఆంటోనీ అల్లు అర్జున్ రావడానికి మూడు గంటల ముందే వెళ్లి ధియేటర్ ను అధీనంలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసుల మాట కూడా వారు వినలేదని చెబుతున్నారు. అర్జున్ వచ్చిన సమయంలో పోలీసుల్ని కూడా నెట్టి వేశారు. తొక్కిసలాట ఘటన విషయాన్ని చెప్పి ఆయనను ధియేటర్ నుంచి పంపించేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా బౌన్సర్లు అడ్డుకున్నారు.               


Also Read: టాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్ 


అందుకే పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ప్రెస్ మీట్ లో బౌన్సర్లపై మండిపడ్డారు. ఎవరైనా బౌన్సర్లు అతి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారు పబ్లిక్ మీద చేయి వేయడం.. తోసి వేయడం వంటివి చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. వారు క్రిమినల్ చర్యల్లో పాల్గొంటే.. ఏజెన్సీలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బౌన్సర్లకు నేతృత్వం వహించిన అంటోనీని అరెస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ప్రైవేటు సెక్యూరిటీ అందర్నీ విపరీతంగా తోసేయడం కూడా తొక్కిసలాట జరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు. 


Also Read: జైలు నుంచి వచ్చిన జానీ మాస్టర్‌కు రామ్ చరణ్ ఇచ్చిన మాట అదే... అల్లు అర్జున్ అరెస్టుపై అడిగితే?


అల్లు అర్జున్ స్టేషన్ లో విచారణ చేస్తున్న సమయంలోనే ఇలా అరెస్టు చేయడంతో పోలీసుల చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసులు ఇంతకు ముందులా ఈ కేసును చూడటం లేదు. చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపణలు చేస్తున్నందున అసలు మొత్తం ఘటనలో వీడియో సాక్ష్యాలతో అన్నీ కోర్టు ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్ కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇప్పటికైతే అర్జున్ ను మళ్లీ అదుపులోకి తీసుకునే అవకాశాలు లేవని చెబుతున్నారు.   


ఆంటోనీ పోలీసులకు ఇచ్చే స్టేట్‌మెంట్ ను బట్టి అల్లు అర్జున్ కేసు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.