వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు వరుస సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను DVV దానయ్య హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. చిత్ర నిర్మాతలు అధికారిక పూజా వేడుకతో ఈ సినిమా లాంచ్ ఈవెంట్‌ను ప్రారంభించారు. హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్, దానయ్య, అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు సహా పలువురు నిర్మాతలు హాజరయ్యారు. ఈ సినిమాకు ప్రస్తుతం ‘OG’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.










గత డిసెంబర్ లో పవన్-సుజిత్ సినిమా ప్రకటన


డిసెంబర్ 2022లో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ సుజీత్‌తో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రీ గ్లింప్స్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ నీడ తుపాకీని పోలి ఉంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా,  సినిమాటోగ్రాఫర్ గా రవి.కె చంద్రన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. సిబ్బందిని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ వెంచర్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.


యాక్షన్ ఎంటర్‌టైనర్ పాన్ ఇండియన్ మూవీ


సుజీత్ పవన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుజీత్‌, పవన్ తో కొత్త సినిమాను డిసెంబర్ 2022లో అధికారికంగా ప్రకటించారు. తాజాగా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అయ్యింది.   


వరుస సినిమాలు చేస్తున్న పవన్


పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘హరిహర వీరమల్లు‘. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో  పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ రూపొందుతోంది. మరొకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్‘.  హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకోటి ‘వినోదయ సీతమ్‘ అనే తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు.


విడుదలకు రెడీ అవుతున్న ‘హరి హర వీర మల్లు’


ఇక దర్శకుడు క్రిష్ జాగర్లమూవీ తెరకెక్కిస్తున్న తాజా మూవీ ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  మార్చి 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Read Also: ప్రభాస్ కారులో మారుతి షికారు, షూటింగ్ మధ్యలో దర్శకుడి సరదా!