అలయ్-బలయ్ వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదంటూ మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మంగళవారం ఓ వీడియో ట్వీట్ చేశారు. అయితే, విష్ణు మీడియాను విమర్శించకుండా.. అసలు జరిగింది ఇదంటూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ మంచు విష్ణును హగ్ చేసుకోవడమే కాకుండా.. ఆయనతో మాట్లాడుతున్నట్లు కలిసింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. మెగా ఫ్యామిలీ Vs మంచు ఫ్యామిలీగా మారిన సంగతి తెలిసిందే. విష్ణు విజయం తర్వాత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు.. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగించింది. అంతేగాక ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో విజేతలుగా నిలిచిన మిగతా సభ్యులు సైతం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయితే, వారి రాజీనామాలను తాను ఆమోదించబోనని, వారితో ఒకసారి మాట్లాడతానని సోమవారం తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో విష్ణు వెల్లడించాడు. తనకు కేవలం ప్రకాష్ రాజ్ నుంచి మాత్రమే రాజీనామా అందిందని, మిగతావారి రాజీనామాలేవీ తనకు అందలేదని విష్ణు స్పష్టం చేశారు. ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడారని విష్ణు తెలిపారు. అయితే, మీడియాలో మాత్రం వేదికపై మౌనంగా కూర్చున్న విష్ణు, పవన్ కళ్యాణ్ వీడియోలను చూపిస్తూ ఇద్దరి మధ్య వైరం స్పష్టంగా కనిపిస్తోందనే వార్తలను ప్రసారం చేయడం గమనార్హం. దీనిపై ప్రజలు మీడియాను కూడా తప్పుబడుతున్నారు.
Also Read: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు
సీసీటీవీ కెమేరాల వివాదం: ‘మా’ ఎన్నికల నిర్వాహణపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ప్రకాష్ రాజ్, ఆయన ప్యానల్ సభ్యులు సోమవారం జూబ్లీ హిల్స్ హైస్కూల్‌కు వెళ్లారు. అక్కడ సీసీటీవీ వీడియోలను పరిశీలించిన తర్వాత ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల నిర్వహణాధికారి వద్ద మరో ఏడు సీసీటీవీ కెమేరా వీడియోలు ఉన్నాయని.. వాటిని కూడా పరిశీలించిన తర్వాతే తాను మాట్లాడతానని తెలిపారు. అయితే, ఎన్నికల అధికారి ఆ వీడియోల కోసం కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పైగా, విష్ణు ప్యానల్ సభ్యులు తిరుపతి పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆ వీడియోలను చూపించలేమని పేర్కొన్నట్లు సమాచారం.
Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి