రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ - ‘సాహో’ ఫేం సుజీత్ సినిమా అధికారిక ప్రకటన రాగానే ఫ్యాన్స్ ఫుల్‌గా ఖుషీ అయ్యారు. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న రూమర్లు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. పవన్ కళ్యాణ్ త్వరలో తమిళ సినిమా ‘తెరి’ రీమేక్ చేస్తున్నాడని వార్తలు వస్తుండటంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.


పవన్ కళ్యాణ్‌తో తన సినిమా గురించి ఒక పెద్ద ప్రకటన రానుందని, ఫ్యాన్స్ దీనిపై ఓపికగా వేచి ఉండాలని ట్వీట్ చేశారు. ఇది అట్లీ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘తెరి’ సినిమా అని వార్తలు వస్తున్నాయి. 2016లో వచ్చిన ఈ సినిమా ‘పోలీస్’ పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో పంపిణీ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది.


ఇప్పటికే తెలుగులో వచ్చి, పెద్ద హిట్ అయిన సినిమాను మళ్లీ రీమేక్ చేయడం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ అడుగుతున్న పెద్ద ప్రశ్న. దీంతో “#WeDontWantTheriRemake” పేరుతో ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ వేసిన ట్వీట్ ప్రకారం ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,'సాహో' ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రకటన ఆదివారం అధికారికంగా వచ్చింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్. 'ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారు' (They Call Him #OG) అని సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ మీద పేర్కొన్నారు. 
 
రీమేకు కాదు ఒరిజినలే!
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో సినిమా రీమేక్ కాదని తెలిసింది. పవర్ స్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సుజిత్ స్టయిలిష్ యాక్షన్ స్క్రిప్ట్ డిజైన్ చేశారట. ఈ కథ కంటే ముందు అతడి చేతిలో 'తెరి' (తెలుగులో 'పోలీస్' పేరుతో విడుదల అయిన విజయ్, సమంత సినిమా) స్క్రిప్ట్ పెట్టారని, ఆ రీమేక్ చేయవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. అయితే... సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో స్ట్రెయిట్ సినిమా చేయడానికి పవన్ మొగ్గు చూపారు.
 
సాహో' తర్వాత సుజిత్ మరో సినిమా చేయలేదు. మూడేళ్లుగా పలు స్క్రిప్ట్స్ మీద వర్క్ చేశారు. పవన్ సినిమాకు ముందు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే... చివరకు పవర్ స్టార్‌ను ఆయన మెప్పించారు. సొంత కథతో ఒప్పించారు.


ప్రపంచ ప్రేక్షకులు అందరూ తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రమిది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం.