మహీరా ఖాన్. పాకిస్తాన్ నటి. 'రయీస్' మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత హిందీ చిత్రపరిశ్రమలో పలు అవకాశాలు వచ్చాయి. నిర్మాణ సంస్థలు మంచి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాయి. కానీ, ‘ఉరి’ దాడుల నేపథ్యంలో ఆమెపై బాలీవుడ్ నిషేధం విధించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పాకిస్తాన్ వెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేసుకుంటుంది. తాజాగా మహీరా రెండో పెళ్లి చేసుకోవడంతో వార్తల్లోకి వచ్చింది. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో పడ్డ కష్టాల గురించి వివరించింది.
అమెరికాలో టాయిలెట్లు కడిగిన పాక్ నటి
మహీరా డిసెంబర్ 21, 1984న కరాచీలో జన్మించింది. ఉన్నత చదువుల కోసం 17 ఏళ్ల వయస్సులో అమెరికాకు వెళ్లింది. కాలిఫోర్నియాలోని శాంటా మోనికా కాలేజీలో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చేరింది. యుఎస్‌లో ఉన్న సమయంలో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది. తన ఖర్చుల కోసం చాలా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసినట్లు తెలిపింది. అయినా, తనకు డబ్బులు సరిపోకపోవడంతో టాయిలెట్లు కూడా కడిగినట్లు వివరించింది. 17 సంవత్సరాల వయసులో చదువు కోసం అమెరికాకు వెళ్లాను. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాను. చేతిలో డబ్బులు లేక అవస్థలు ఎదుర్కొన్నాను. చేతి ఖర్చుల కోసం చాలా పనులు చేశాను. చివరకు హౌస్ కీపింగ్ చేశాను. ఫ్లోర్లు తుడిచేది. టాయిలెట్లు కూడా కడిగేది. కష్టాలు మనిషిని ఎలాంటి పనులైనా చేయిస్తానని అప్పుడు నాకు అర్థం అయ్యింది” అని మహీరా చెప్పుకొచ్చింది.
2017లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మహీరా
అమెరికా నుంచి పాకిస్తాన్ కు వెళ్లిన తర్వాత MTV పాకిస్తాన్‌లో వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టింది మహీరా. అనంతరం పాకిస్థానీ చిత్రం ‘బోల్’ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2017లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రయీస్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఉరి దాడుల నేపథ్యంలో రెండు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాక్ నటీనటులను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. ఆ తర్వాత మహీరా పాక్ సినిమాల్లో నటిస్తుంది.
పాక్ బిజినెస్ మ్యాన్ తో మహీరాకు రెండో పెళ్లి
తాజాగా మహీరా రెండో పెళ్లి చేసుకుంది. సలీమ్ అనే పాకిస్తానీ బిజినెస్ మ్యాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలం పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మహీరాకు గతంలోనే ఓసారి పెళ్లి అయ్యింది. భర్తతో గొడవల కారణంగా విడిపోయింది. ఆ తర్వాత కొంత కాలం పాటు ఒంటరి జీవితాన్ని గడిపింది. తర్వాత సలీమ్ పరియయం కావడంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. మహీరా గత ఏడాది మూడు సినిమాలు చేసింది. పలు టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది.
Read Also: ‘లియో‘ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial