టాలీవుడ్ ట్యాలెంటెడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ (Satyadev) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "జీబ్రా" (Zebra Movie). ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే వారం థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం చిత్రబృందం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందు ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది? ఓటీటీ డీల్ ఎంత ? అంటే...


సత్యదేవ్, డాలీ ధనుంజయ (Dolly Dhananjay) హీరోలుగా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ రూపొందిస్తున్న చిత్రం "జీబ్రా". "లక్ ఫేవర్స్ ది బ్రేవ్" అనే ఉప శీర్షికతో క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ నవంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఇందులో ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ హీరోయిన్లుగా నటించగా... సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు మేకర్స్.


ఆహా ఓటీటీకి ''జీబ్రా'' రైట్స్!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి డీల్ వివరాలు బయటకు వచ్చాయి. "జీబ్రా" మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఆహా సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ రైట్స్ కోసం ఆహా మేకర్స్ కి దాదాపు రూ.5 కోట్లు చెల్లించినట్టుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. సాధారణంగా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తరువాత 4 వారాలకు ఓటీటీలో సందడి చేస్తున్నారు. కొన్ని సినిమాలు మాత్రం అంతకంటే ముందుగానే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే అది సినిమాలకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఉంటుంది. అయితే 'జీబ్రా' మూవీ క్రిస్మస్ కానుకగా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.


రీసెంట్ గా హైదరాబాదులో "జీబ్రా" మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించగా, ఆ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక ఈవెంట్లో ఆయన సత్యదేవ్ పై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు, తన అభిమానిని ఉత్తరాంధ్ర యాసలో టీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. దీంతో ఈ సినిమా అందరి దృష్టిలో పడింది.


Read Also : Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్



మెగాస్టార్ చిరంజీవి తన మూడవ తమ్ముడు అంటూ సత్యదేవ్ గురించి అభిమానులకు చెప్పడంతో, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా గట్టిగానే లభిస్తుంది "జీబ్రా" మూవీకి. మరోవైపు సత్యదేవ్ వరుసగా సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇస్తూ 'జీబ్రా'పై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సత్యదేవ్ ఖాతాలో ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు. దీంతో ఈ యంగ్ హీరో ఆశలన్నీ 'జీబ్రా' సినిమాపైన పెట్టుకున్నాడు. మరి ఈ మూవీ అయినా ఆయనకు కావలసిన బ్లాక్ బస్టర్ హిట్ ను ఇస్తుందా? అనేది తెలియాలంటే నవంబర్ 22న 'జీబ్రా' మూవీ థియేటర్లలోకి వచ్చేదాకా వెయిట్ అండ్ సి.


Read Also : Aditi Govitrikar: పవన్ కళ్యాణ్ హీరోయిన్... 17 ఏళ్ల తర్వాత తిరుమలలో ప్రత్యక్షం... రీఎంట్రీ కోసం ప్లాన్ వేసిందా?