The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

The Rana Daggubati Show Streaming Platform: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రానా దగ్గుబాటి ఒక టాక్ షో లాంటిది చేశారు. దానికి వచ్చిన సెలబ్రిటీలు ఎవరు? స్ట్రీమింగ్ డేట్ ఏమిటి? వంటిది చూడండి.

Continues below advertisement

భారతీయ బాక్సాఫీస్ భల్లాల దేవుడు, పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati)కి టాక్ షో చేయడం కొత్త కాదు. ఇంతకు ముందు 'నంబర్ వన్ యారి' చేశారు. కానీ, ఇప్పుడు తన పేరు మీద 'ది రానా దగ్గుబాటి షో' చేస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏమిటి? కాన్సెప్ట్ ఏమిటి? స్ట్రీమింగ్ డేట్ ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే....

Continues below advertisement

స్క్రిప్ట్ లేదు... రానాకూ ఐడియా లేదు!
సాధారణంగా సెలబ్రిటీ టాక్ షోలు అంటే స్క్రిప్టెడ్ అని ఇండస్ట్రీలో మాత్రమే కాదు... ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది. అయితే... స్క్రిప్ట్ ఏమీ లేకుండా 'ది రానా దగ్గుబాటి షో' చేస్తున్నారు. క్యాండిడ్ కన్వర్జేషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఒక్క చోట షో చేయాలని అనుకోలేదు. షో కోసం ఒక సెట్ వేశారు. అందులో కొంత మంది సెలబ్రిటీలతో చిట్ చాట్ / ఇంటర్వ్యూలు చేశారు.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి వంటి సెలబ్రిటీలతో అవుట్ డోర్ ఇంటర్వ్యూలు చేశారు. షో ఎలా ఉండబోతుందో తనకూ ఐడియా లేదని రానా దగ్గుబాటి చెప్పడం విశేషం. 

గెస్టులు ఎవరెవరు? ఎంత మంది ఉన్నారు?
'ది రానా దగ్గుబాటి షో'లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? అనేది ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ కాలేదు. కానీ, సెలబ్రిటీల్లో ఎవరెవరు వస్తున్నారు? అనేది ప్రోమోలో చూపించి అంచనాలు పెంచారు రానా. 

'బాహుబలి చేసేటప్పుడు ఇటువంటి ఆఫీస్ ఎందుకు లేదు?' అని రానా అడిగితే... 'అప్పుడు డబ్బులు లేవు' అని రాజమౌళి చెప్పడం జనాలను ఆకట్టుకుంది. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూకు తన టీ షర్టు మీద 'దేవుడు సెన్సార్ చేయడు' అని క్యాప్షన్ రాసుకుని వెళ్లారు. రాజమౌళి, ఆర్జీవీతో పాటు రిషబ్ శెట్టి, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా ఈ షోకి వచ్చారు. ఆయనతో సుమంత్ జాయిన్ అయ్యారు.

న్యాచురల్ స్టార్ నాని, ఆయనతో 'గ్యాంగ్ లీడర్', 'సరిపోదా శనివారం' సినిమాల్లో నటించిన హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ ఓ ఎపిసోడ్‌లో సందడి చేశారు. యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, తెలుగమ్మాయి శ్రీ లీల మరో ఎపిసోడ్‌లో సందడి చేశారు. మలయాళ స్టార్, తెలుగు ప్రేక్షకులు సైతం తెలిసిన దుల్కర్ సల్మాన్, ఆయనతో పాటు 'లక్కీ భాస్కర్' హీరోయిన్ మీనాక్షి చౌదరి మరొక ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. సెలబ్రిటీలు అందరిలో స్పెషల్ అంటే... రానా వైఫ్ మిహీకా బజాజ్. ఆవిడ ఏం చెప్పారో షో చూస్తే తెలియాలి.

Also Read: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య


స్ట్రీమింగ్ డేట్ ఎప్పటి నుంచో తెలుసా?
The Rana Daggubati Show Streaming Date: నవంబర్ 23... అంటే ఈ శనివారం కాకుండా వచ్చే శనివారం నుంచి 'ది రానా దగ్గుబాటి షో' స్ట్రీమింగ్ కానుంది. ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు నుంచి వస్తున్న ఫస్ట్ టాక్ షో ఇది. రాజీవ్ రంజన్ ప్రొడ్యూస్ చేసిన ఈ షోకి ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. వినోద్ వి తళవన్, సుఖ్వీందర్ సింగ్ చౌహన్, శీకాంత్ ప్రభల డైరెక్షన్ చేశారు.

Also Read'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?

Continues below advertisement