Disney+Hotstar : రీసెంట్ డేస్ లో ఆన్ లైన్ లో మూవీస్, వెబ్ సిరీస్ చూసేందుకే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, హాట్‌స్టార్ ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే వీటిల్లో ఏం చూడాలన్నా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంది. కానీ చాలా సార్లు, సమయం లేకపోవడం వల్ల, చాలా మంది ఈ యాప్స్ ను ఎక్కువగా ఉపయోగించకపోవచ్చు. ఇవి నెలవారిగా చెల్లింపులను కలిగి ఉన్నందున మనం చూసినా, చూడకపోయినా.. టైం లిమిట్ అయిపోగానే సబ్‌స్క్రిప్షన్‌ డేట్ కూడా అయిపోయితుంది. దీని వల్ల సబ్‌స్క్రైబర్స్ చెల్లించిన డబ్బు వృథా అవుతుంది. ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం చాలా సులభం అయింది. దీని కోసం మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ మాన్యువల్‌గా క్యాన్సిల్ చేయాలి. మీ డబ్బు కట్ కాకుండా నిరోధించే కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


మీరు మీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ అకౌంట్ లో ఆటో పేమెంట్ కట్ ఆప్షన్‌ను ఎంచుకోకపోవడమే ఈ సమస్యకు పరిష్కారం, ఎందుకంటే మీరు మీరే చెల్లింపు చేస్తే తప్ప, మీ ఖాతా నుంచి డబ్బు కట్ కాదు.


Auto-Renew ఆప్షన్ ను ఎలా ఆఫ్ చేయాలి?


 ముందుగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు లాగిన్ అవ్వండి.


 ప్రొఫైల్‌కి వెళ్లి సబ్‌స్క్రిప్షన్ లేదా అకౌంట్ ఆప్షన్‌ని ఎంచుకోండి.


 ఆపై auto-renew ఆప్షన్ ను ఆఫ్ చేయండి. దీని ద్వారా మీ సబ్‌స్క్రిప్షన్‌ నెక్ట్స్ టైం దానింతట అదే కాదు. డబ్బు కూడా కట్ కాదు.


సబ్‌స్క్రిప్షన్ ను ఎలా క్యాన్సిల్ చేయాలి?



  • అన్నింటికన్నా మొదటిది, మీ అకౌంట్ కు లాగిన్ చేసి, ఆపై Manage Subscription ఆప్షన్ ను వెళ్లండి.

  • ఇక్కడ Cancel Subscriptionపై క్లిక్ చేయండి. మీ సబ్‌స్క్రిప్షన్ చెల్లుబాటు ముగిసే వరకు మీరు దీన్ని ఉపయోగించవచ్చు.


బ్యాంక్ అలర్ట్స్ ను సెట్ చేయండి 



  • మీరు మీ బ్యాంక్ ఖాతాలో అలర్ట్స్ ను కూడా సెట్ చేయవచ్చు. దీని వల్ల అనవసరంగా డబ్బు కట్ అయ్యే ప్రక్రియకు స్వస్తి చెప్పొచ్చు.


మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు షేర్ చేయొద్దు



  • మీరు సబ్‌స్క్రిప్షన్‌ల నుంచి డెబిట్/క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని తీసివేయవచ్చు. దీని వల్ల మీరు అవాంఛిత సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నివారించవచ్చు. అలా చేస్తే మీ పర్మిషన్ లేకుండా డబ్బు కట్ కాకుండా ఉంటుంది.


నెట్ ఫ్లిక్స్ స్కామ్


నెట్ ఫ్లిక్స్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఒకటి. కొన్ని రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ యూజర్లను టార్గెట్‌ చేస్తున్నారని ఓ వార్త వైరల్ అయింది. ఎస్‌ఎంఎస్‌ ద్వారా అనుమానాస్పద లింక్‌లను పంపి.. యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రేలియాతో సహా 23 దేశాల్లోని యూజర్ల వ్యక్తిగత సమాచారం పొందడానికి స్కామర్లు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేసి అడిగిన వివరాలను అందివ్వగానే.. స్కామర్లు మన సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తారని ఓ వార్తా కథనం తెలిపింది.


Also Read : 2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?