విక్రాంత్ మాస్సే... '12th ఫెయిల్' సినిమాతో దాదాపుగా అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితుడు. సాఫ్ట్ ఇమేజ్ తో వరుస సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు సీరియల్ కిల్లర్ గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్రాంత్ మెయిన్ లీడ్ చేసిన 'సెక్టార్ 36' మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ నెల 13 నుంచి 4 భాషల్లో వీక్షకులకు సినిమా అందుబాటులో ఉంటుంది. 


'12th ఫెయిల్' మూవీలో చదువంటే ఆసక్తి ఉన్న పల్లెటూరి పిల్లాడిగా కనిపించిన ఆయన తాజా ప్రాజెక్ట్ లో ఓ సీరియల్ కిల్లర్ గా కనిపించారు. విక్రాంత్ మాస్సే ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టోరీ డిజైన్ చేయలేదు. ఆయనను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే సీరియల్ కిల్లర్ ఇతడేనా, కిడ్నాప్ చేసిన పిల్లల్ని నిజంగానే ఆ కిల్లర్ చంపాడా, లేక ఎక్కడైనా దాచి ఉంచాడా అనేది ట్రైలర్ లో రివీల్ చేయలేదు. ఆసక్తికరంగా ఈ ట్రైలర్ కట్ చేశారు. ఆదిత్య నింబాల్కర్ ఈ సినిమాకు డైరెక్టర్. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. 


ఓటీటీలో సూపర్ హిట్ జానర్ క్రైమ్ అండ్ రొమాన్స్. సెక్టార్-36 అనేది పూర్తిగా క్రైమ్ జానర్ మూవీ. పిల్లల్ని కిడ్నాప్ చేసి రివేంజ్ తీర్చుకునే సీరియల్ కిల్లర్ గా విక్రాంత్ మాస్సేని చూపించారు దర్శకుడు. ఆ సీరియల్ కిల్లర్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఇతరులపై పగబట్టి పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటాడు. ఆ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పై కూడా విక్రాంత్ పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతను పోలీసులకు దొరుకుతాడు. అయితే అతను క్రైమ్ చేసినట్టు నిరూపించగలరా? లేదా తెలివిగా అతను తప్పించుకుంటాడా? అనేది సినిమాలో చూడాలి.


Also Read: అక్కినేని నాగ చైతన్య @ 15 ఇయర్స్... స్టార్ కిడ్ నుంచి స్టార్ వరకు, ఆ జర్నీలో మలుపులు ఎన్నో



హీరోగా సాఫ్ట్ ఇమేజ్ తెచ్చుకున్న విక్రాంత్ ఈ ప్రాజెక్ట్ లో సీరియల్ కిల్లర్ గా నటించేందుకు ఒప్పుకున్నాడంటే కథలో సమ్ థింగ్ ఏదో ఉంది అనే క్యూరియాసిటీ అందరికీ ఉంది. అయితే ఆ క్యూరియాసిటీని ట్రైలర్ మరింత పెంచింది కానీ, రివీల్ చేయలేదు. ఇంతకీ విక్రాంత్ ని అంతగా ఆకట్టుకున్న పాయింట్ ఏది? ఇప్పటి వరకు లేడీస్ కి సంబంధించిన క్రైమ్ పాయింట్ ని టచ్ చేస్తూ ఓటీటీ వెబ్ సిరీస్, మూవీస్ వచ్చాయి. మరి ఈ సెక్టార్-36లో పిల్లల్ని మాత్రమే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు అనేది తెలియాలంటే మరో వారం వెయిట్ చేయాలి. 


సినిమాలు చేస్తున్నా కూడా ఈ జనరేషన్ హీరోలు ఓటీటీలను వదిలిపెట్టడం లేదు. ఓటీటీలో డైరెక్ట్ మూవీస్, వెబ్ సిరీస్ తో సందడి చేస్తున్నారు. ఆ జానర్ లో విక్రాంత్ మస్సే కూడా ఓ మంచి ప్రాజెక్ట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓటీటీలో విక్రాంత్ సక్సెస్ అవుతాడా లేదా వెయిట్ అండ్ సీ. 


Also Readవిజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి