Neeli Megha Shyama OTT Release Date : డైరెక్ట్ గా ఓటీటీలోకి '35 చిన్న కథ కాదు' హీరో సినిమా, ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Neeli Megha Shyama OTT Streaming : '35 చిన్న కథ కాదు' ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటించిన కొత్త మూవీ 'నీలి మేఘ శ్యామ' ఓటీటీ ప్రీమియర్ డేట్ వచ్చేసింది.
Watch Movies on Aha OTT | గత ఏడాది తెలుగులో '35 చిన్న కథ కాదు' అనే సినిమాలో నటించిన యంగ్ హీరో విశ్వదేవ్ రాచకొండ లీడ్ రోల్ పోషిస్తున్న మరో కొత్త సినిమా 'నీలి మేఘశ్యామ'. ఈ మూవీ తాజాగా డైరెక్ట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. 'నీలి మేఘశ్యామ' (Neeli Megha Shyama) మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
ఆహాలో 'నీలి మేఘశ్యామ' స్ట్రీమింగ్...
ఆహా ఓటీటీ (Aha OTT) నుంచి ఇటీవల కాలంలో వస్తున్న ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ లు అదరగొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 'నీలి మేఘశ్యామ' అనే తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుండడం విశేషం. మరో వారం రోజుల్లో ఈ మూవీ ఓటిటిలోకి రాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా ఆహా వెల్లడించింది. ఈ మేరకు "మీతో ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ, ఎమోషన్స్ కు సంబంధించి విభిన్నమైన షేడ్స్ ఉన్న నీలి మేఘశ్యామ జనవరి 9 నుంచి ఆహాలో ప్రీమియర్ కాబోతోంది' అనే క్యాప్షన్ తో ట్వీట్ చేశారు. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ఆహా మంచి ధరకే సొంతం చేసుకున్నట్టుగా టాక్ నడుస్తోంది.
ముందు థియేటర్లలోనే ప్లాన్... కానీ...
ఈ సినిమాకు శరణ్ భరద్వాజ్ సంగీతం అందించగా, రవి ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరో విశ్వదేవ్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమాను ముందుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే మేకర్స్ చాలా రోజుల నుంచి చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో, ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సినిమా మొత్తం ఓ యువకుడి లైఫ్ లో ట్రెక్కింగ్ ఎలాంటి మలుపులు తీసుకొచ్చింది అన్న లైన్ ఆధారంగా రూపొందింది.
విశ్వదేవ్ రాచకొండ గురించి...
విశ్వదేవ్ రాచకొండ ఇటీవల కాలంలో వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. రీసెంట్ గా '35 చిన్న కథ కాదు' అనే చిన్న సినిమాలో నివేద థామస్ హస్బెండ్ గా నటించి ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. అలాగే గత ఏడాది రిలీజ్ అయిన విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లో హీరోయిన్ మీనాక్షి చౌదరి అన్నయ్యగా కూడా నటించాడు. అంతకుముందు పిట్టగోడ, కిస్మత్ అనే సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. అయితే ఆ సినిమాలేవి తీసుకురాలేని గుర్తింపును '35 చిన్న కథ కాదు' తీసుకొచ్చింది.
లో బడ్జెట్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను దక్కించుకుంది. పైగా ఈ మూవీ కూడా ఆహా ఓటీటీ లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం. ఇలా ఓవైపు అంది వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకుండా హీరోగా నటిస్తూనే, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నాడు విశ్వదేవ్. ఇక ఇప్పుడు 'నీలి మేఘశ్యామ' సినిమాతో ఆహా ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు.
Also Read: ‘గేమ్ చేంజర్’పై ఎఫెక్ట్ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే