Suriya's Vishwanath And Sons OTT Platform Locked : కోలీవుడ్ స్టార్ సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో రాబోతోన్న రీసెంట్ ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ రిలీజై ట్రెండ్ అవుతోంది. జులైలో మూవీ రిలీజ్ కానుండగా ఓటీటీ డీల్ ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సూర్య కెరీర్‌లో ఇది 46వ సినిమా కాగా... సూర్య సరసన ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు.

వీరితో పాటే రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.

Also Read : మీకు మా ఆయనే కనిపించాడా..? 'పీలింగ్స్'.. చోలీ కే పీచే అంటే పర్లేదా..? అంటూ KD సాంగ్‌పై రచ్చ లేపిన రక్షిత

ఈ మూవీలో సూర్య వింటేజ్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. ఫ్యామిలీ, ఎమోషన్స్ అన్నీ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. సూర్య ఒలింపిక్ ప్రొఫెషనల్ షూటర్‌గా కనిపించనున్నారు. 50 ఏళ్లు పైబడిన హీరోను 20 ఏళ్ల అమ్మాయి లవ్ చేస్తే ఏం జరిగింది?  ఓ షూటర్‌గా హీరో తన లక్ష్యాన్ని సాధించాడా? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.