KD the Devil Song Controversy: కన్నడ క్రేజీ ప్రాజెక్ట్ ‘KD: ది డెవిల్’ చిత్రంలోని తాజా సాంగ్ ‘సర్సే నిన్న సెరగా సర్సే’ (Sarse Ninna Seraga Sarse)  వివాదానికి దారితీసింది.  హిందీ వెర్షన్ Sarke Chunar పై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. కన్నడ డైరక్టర్ ప్రేమ్ ప్యాన్‌ ఇండియా స్థాయిలో తీస్తున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా నటిస్తున్నారు. ఈ మధ్యనే  ఈ సినిమాలోని ఐటమ్ 'సాంగ్ సర్సే నిన్న సెరగా సర్సే' రిలీజ్ అవ్వడం దానిపై రచ్చ లేవడం తెలిసిందే. సంజయ్‌దత్ -నోరా ఫతేహీపై చిత్రీకరించిన ఈ సాంగ్‌ హిందీ లిరిక్స్ Sarke Chunar అన్ని హద్దులు పరమ బూతు అని పేరు తెచ్చుకుంది.  అభ్యంతరకర లిరిక్స్, బోల్డ్ కొరియోగ్రఫీపై నెటిజన్లు, సెలబ్రిటీలు మండిపడటంతో పాటు.. జాతీయ మానవహక్కుల సంఘం NHRC కూడా రెస్పాండ్ అయింది. దీంతో ఆ సాంగ్‌ను యూట్యూబ్‌ నుంచి తొలగించారు. దీనిపై విపరీతమైన చర్చ జరుగుతుండగా.. ఈ వివాదంలోకి  డైరెక్టర్ ప్రేమ్ భార్య, ఒకప్పటి  హీరోయిన్ రక్షిత ఎంటర్‌ అయ్యారు. సాంగ్‌పై వస్తున్న విమర్శలను అంగీకరిస్తూనే చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

మా సాంగే దొరికిందా.. రక్షిత ఘాటు రిప్లై

Sarse Ninna Seraga Sarse పై ఆన్‌లైన్‌లో బాగా రచ్చ అవుతోంది. కొంతమంది ఈ సినిమా డైరక్టర్ వైఫ్, నటి రక్షితను ట్యాగ్ చేసి ఆమెను ప్రొవోక్ చేశారు. దీనిపై రక్షిత చాలా ఘూటుగా రియాక్ట్ అయ్యారు. తన Instagram స్టోరీలో భారీ మెసేజ్‌ను పెట్టారు. "అవును, నేను అన్నీ చూస్తున్నాను. చాలామంది నన్ను ట్యాగ్ చేస్తున్నారు. మీకు అన్నీ ఇప్పుడే గుర్తుకు వస్తున్నాయి. ఇంతకు ముందు  ‘చోళీ కే పీచే’, ‘పీలింగ్స్’ Dreamum Wakepum లాంటి వందలాది సాంగ్స్ వచ్చినప్పుడు ఎవరికీ ప్రాబ్లమ్ కాలేదు. కానీ మా సాంగ్ వచ్చేసరికి అందరికీ ప్రాబ్లమ్ వచ్చింది" అని రియాక్ట్ అయ్యారు. 

సమర్థించుకోవడం లేదు... కానీ ఏంటీ  Selective Outrage..?

KD సాంగ్‌పై వచ్చిన విమర్శలను రక్షిత అంగీకరించారు. సాంగ్‌  పట్ల ఉన్న అభ్యంతరాలను కూడా ఒప్పుకున్నారు. అయితే కొన్ని విషయాలు.. కొంతమంది విషయంలోనే స్పందిస్తున్నటువంటి Selective Outrageను ఆమె ప్రశ్నించారు. "ఓ సినిమాలో సెక్స్ గురించి సినిమా అంతా మాట్లాడుకున్నా ఎవరికీ తప్పు లేదు కానీ ఏదో పాటలో ఉన్న కొన్ని వాక్యాల గురించి మాత్రం అభ్యంతరం వస్తుందని" ఆవేదన చెందారు.

ప్రేమ్‌ను విమర్శించండి.. కానీ దూషించకండి

ఒక పాటను బట్టి దర్శకుడి ప్రతిభను అంచనా వేయలేమని రక్షిత పేర్కొన్నారు. "ప్రేమ్ కూడా మీ అందరిలాగే ఒక కన్నడిగుడు. ఆయన పనిని ప్రశ్నించే హక్కు మీకు ఉంది, కానీ వ్యక్తిగతంగా దూషించే హక్కు ఎవరికీ లేదు. కన్నడ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లడానికి, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మార్కెట్ క్రియేట్ చేయడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమాను బయట మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి Prem ఓ గిమ్మిక్ చేశారు. అది ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. బయట మార్కెట్ కాదు.. ఇక్కడ కన్నడ మార్కెట్‌లో సినిమాను తీసుకెళ్లడానికి కూడా ఎంత కష్టమవుతుందో తెలుసా..? దీనిని ఇతర మార్కెట్లకు తీసుకెళ్లడానికి కొంచం ఎక్కువ స్వేచ్ఛ తీసుకున్నాడు. ఒకవేళ అది మీకు నచ్చకపోయి ఉంటే థియేటర్‌కు వచ్చి సినిమా చూశాక అది చెప్పి ఉంటే బాగుండేది" అని ఆవేదన వ్యక్తం చేశారు. 

నా బాడీని కూడా విమర్శించారు. 

రక్షిత ఈ సందర్భంగా తనను బాడీ షేమింగ్ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. తన శరీరంపై చాలా రకాలుగా కామెంట్లు చేశారని.. కానీ అవన్నీ తాను ప్రేమతోనే స్వీకరించానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా కన్నడ ప్రజల నుంచి అటువంటి ప్రేమనే ఆశిస్తున్నా అన్నారు. పాట పోయిందని ఆందోళన అవసరం లేదని.. దానిని మించిన అట్రాక్షన్ తీసుకొస్తామంటూ చివర్లో  Winky గా రెస్పాండ్ అయ్యారు రక్షిత..