Abhignya Vuthaluru and Charan Lakkaraju's'Viraatapalem PC Meena Reporting' web series streaming on Zee5 OTT: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పాపులర్ అయిన అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'. జీ5 ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ ఇది. ఇందులో చరణ్ లక్కరాజు హీరో. గురువారం మిడ్ నైట్ 12 గంటలు (జూన్ 27వ తేదీ) నుంచి స్ట్రీమింగ్ కానుంది. అభిజ్ఞ, చరణ్ కాకుండా ఇందులో నటించిన ఆర్టిస్టులు ఎవరు? టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? రన్ టైమ్ ఎంత? అనేది చూస్తే... 'విరాటపాలెం'లో ఏడు ఎపిసోడ్స్!How Many Episodes In Viraatapalem Web Series?: 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ రన్ టైమ్ 30 నిమిషాల కంటే తక్కువ. సో, టోటల్ రన్ టైమ్ మూడు గంటల లోపే ఉంటుంది. థియేటర్లకు వెళ్లి సినిమా చూసి వచ్చే సమయం కంటే ఇంట్లో కూర్చుని 'జీ5' ఓపెన్ చేసి 'విరాటపాలెం' వెబ్ సిరీస్ చూసే టైమ్ తక్కువ.

'విరాటపాలెం' కథ - కాన్సెప్ట్ ఏమిటి?What is the story of Viraatapalem series?: 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్' ఓ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. కథ విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాల్లో, 80లలో ఒక మారుమూల పల్లె విరాటపాలెంలో ప్రజలు తమ గ్రామానికి శాపం ఉందని చాలా బలంగా నమ్ముతారు. ఎవరు పెళ్లి చేసుకున్నా సరే... మరుసటి రోజు పెళ్లి కుమార్తె రక్తం కక్కుకుని మరణిస్తుంది. దాంతో పదేళ్ల పాటు ఆ ఊరిలో పెళ్లి అనేది జరగదు. అటువంటి ఊరికి లేడీ కానిస్టేబుల్‌ మీనా (అభిజ్ఞ వూతలూరు) వస్తుంది. విరాటపాలెం గ్రామంలో ప్రజల మూఢ నమ్మకాలు తప్పని నిరూపించడానికి, ఆ ఊరిలో రహస్యాలను వెలికి తీయడానికి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పటివరకు సంభవించిన పెళ్లి కుమార్తెల మరణాల వెనుక ఎవరు ఉన్నారు? చివరకు ఏమైంది? అనేది సిరీస్.

Also Read: పాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో

'విరాటపాలెం'లో ఎవరెవరు నటించారు?ఈ సిరీస్ తీసిన దర్శక నిర్మాతలు ఎవరు?'జీ5'లో స్ట్రీమింగ్ అవుతున్న 'రెక్కీ' వెబ్ సిరీస్ చూశారా? అది తీసిన పోలూరు కృష్ణ ఈ 'విరాటపాలెం' వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఆ సిరీస్ ప్రొడక్షన్ హౌస్ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ పతాకం మీద శ్రీరామ్ ఈ సిరీస్‌ను కూడా నిర్మించారు. 

Zee5 Web Seires Viraatapalem Cast And Crew: అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు మెయిన్ లీడ్ రోల్స్ చేసిన 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'లో లావణ్య సాహుకర, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్  ఇతర ప్రధాన తారాగణం. ఈ సిరీస్‌కు కథ: దివ్య తేజస్వి పెరా, స్క్రీన్‌ ప్లే: విక్రమ్ కుమార్ కండిమల్ల, కెమెరా: మహేష్ కె స్వరూప్, ఎడిటింగ్: ఫరూఖ్ హుండేకర్, నేపథ్య సంగీతం: రోహిత్ కుమార్.

Also Readఎవరీ ప్రీతి ముకుందన్? 'కన్నప్ప'లో విష్ణు మంచు జంటగా నటించిన హీరోయిన్ బ్యాగ్రౌండ్, కెరీర్ తెల్సా?