Panchayat Web Series Season 4 OTT Streaming On Amazon Prime: సూపర్ హిట్ విలేజ్ కామెడీ డ్రామా సిరీస్ 'పంచాయత్' సీజన్ 4 ఓటీటీలోకి వచ్చేసింది. గత 3 సీజన్ల మాదిరిగానే అంతే కామెడీ.. ఎలక్షన్ హీట్‌తో అందుబాటులోకి వచ్చింది. 

ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్

ఇప్పటివరకూ వచ్చిన 3 సీజన్లు ఫుల్ కామెడీతో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. 2020లో ఫస్ట్ సీజన్, 2022లో సెకండ్ సీజన్, 2024లో థర్డ్ సీజన్ రాగా సెపరేట్ ఫ్యాన్ బేస్‌తో ఓటీటీలో దూసుకెళ్లాయి. తాజాగా కొత్త సీజన్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయ్ వర్గీయ దర్శకత్వం వహించగా.. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, సునీతా రాజ్వార్, దుర్గేష్ కుమార్, పంకజ్ ఝా కీలక పాత్రలు పోషించారు.

పంచాయతీ ఎన్నికల వార్

కొత్త సీజన్‌లో పంచాయతీ ఎన్నికలే ప్రధానాంశంగా సాగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. సిటీలో పుట్టి పెరిగిన యువకుడు అభిషేక్ గవర్నమెంట్ జాబ్ అనే ఆశతో గ్రామీణ ప్రాంతానికి సెక్రటరీగా వెళ్తాడు. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు, అక్కడి పంచాయతీ పెద్దల తీరును కామెడీగా ఫస్ట్ 3 సీజన్లలో చూపించారు. తాజా సీజన్‌లో కొత్తగా మళ్లీ పంచాయతీ ఎన్నికల యుద్ధాన్ని కామెడీగా చూపించారు.

Also Read: డ్రగ్స్ కేసులో శ్రీరామ్ - తెలుగు నుంచి తమిళ్‌కు... తిరుపతి హీరో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?