నరేష్ అగస్త్య, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న పీరియాడిక్ సిరీస్ 'వికటకవి'. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సిరీస్ కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాగ్రౌండ్ తో రూపొందుతున్న మొట్టమొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. 'వికటకవి' సిరీస్ ను జీ5లో నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డైరెక్టర్ 'వికటకవి' ప్రయాణం ఎలా మొదలైంది అనే ఇంట్రెస్టింగ్ విషయంతో పాటు ఈ సిరీస్ కు ఇలాంటి పేరు ఎందుకు పెట్టారు అనే పలు ఆసక్తికరమైన విషయాలను డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి వెల్లడించారు. 


ప్రశాంత్ వర్మతో 'అ!', 'కల్కి' సినిమాలకు వర్క్ చేసిన రైటర్ తేజ దేశ్ రాజ్ కథను రాసుకోగా, తనకు ఆయన మంచి స్నేహితుడు కావడంతో ఇద్దరూ కలిసి ఈ సిరీస్ ని తెరకెక్కించే సన్నాహాలు చేసుకున్నారట. ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ సినిమా స్టోరీ అంతా 1940, 1970 టైం లైన్లో జరుగుతుందని వెల్లడించారు. స్వాతంత్రం రాకముందు మన దేశంలో ఎన్నో సంస్థానాలు ఉండగా... వాటిలో ఒకటి తెలంగాణకు చెందిన అమరగిరి ప్రాంతమని చెప్పుకొచ్చారు డైరెక్టర్. రైటర్ తేజ ఐడియా మేరకు శ్రీశైలం ప్రాజెక్టును పూర్తి చేస్తున్న క్రమంలో ఊరు మునిగిపోతుంది అనే బ్యాకప్ తో 'వికటకవి' అనే ఫిక్షనల్ పాయింట్ ను తీసుకున్నామని వెల్లడించారు.


స్టోరీ విషయానికి వస్తే... 1940లో అమరగిరి ప్రాంతంలో జరిగిన సంఘటన మళ్లీ 1970లో రిపీట్ అవుతుంది. అలా జరగడాన్ని అక్కడి ప్రజలు అమ్మోరు శాపంగా భావిస్తారు. అది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి హీరో అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది తెరపై చూడాల్సిందే. ఇక ఈ కథకు 'వికటకవి' అనే టైటిల్ ను పెట్టింది రైటర్ తేజ అని అన్నారాయన. "తెలుగులో 'వికటకవి' అంటే రాయల సంస్థానంలో పని చేసిన తెనాలి రామకృష్ణుడు, అతని హాస్య చతురత గుర్తొస్తాయి. కానీ ఇది ఫిక్షనల్ డిటెక్టివ్ స్టోరీ కదా ఎందుకు వికటకవి అనే టైటిల్ పెట్టారని అడిగినప్పుడు.. దానికి రైటర్ తేజ స్పందిస్తూ తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలు దగ్గర గూడాచారిగా పని చేశారు. బహమనీ సుల్తాన్ ల నుంచి రాయలవారి రాజ్యాన్ని కాపాడడంలో ఆయన ఎంతో కీలకమైన పాత్రను పోషించారు. ఈ వెబ్ సిరీస్ లో హీరోకి కూడా అలాంటి షేడ్స్ ఉండడం వల్ల వికటకవి అనే టైటిల్ పెట్టాను అని చెప్పారు" అంటూ టైటిల్ వెనక ఉన్న స్టోరీని వెల్లడించారు. అలాగే సేనాపతి, మత్తు వదలరా చూశాక సినిమాలో నరేష్ అగస్త్యను హీరోగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యామన్నారు.


Also Readకంగువ రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందా? - కోలీవుడ్ స్టార్ హిట్ కొట్టారా?



ఇక టాలీవుడ్ లో ఎంతోమంది సినిమాటోగ్రాఫర్స్ ఉన్నప్పటికీ ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా పంజాబీ సినిమాటోగ్రాఫర్ ను తీసుకొచ్చారు డైరెక్టర్. ఈ విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. "ఇండస్ట్రీలో నాకు ఎంతోమంది సినిమాటోగ్రాఫర్, డీవోపీ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ పంజాబీ కెమెరామెన్ ను ఎందుకు తీసుకొచ్చారు ? అని చాలామంది ప్రశ్నించారు. అయితే 'వికటకవి'లో డ్రామా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే కొత్త సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుందని అనిపించి షోయబ్ ని తీసుకున్నాము. ఓ బెంగాలీ సినిమా చూసినప్పుడు అది బాగా నచ్చడంతో షోయబ్ ను, అలాగే దానికి పని చేసిన ఆయన స్నేహితుడు సంజీవ్ అనే టెక్నీషియన్ ను మా ప్రాజెక్టులో తీసుకున్నాము" అని చెప్పుకొచ్చారు. అయితే షోయబ్ ఇప్పటిదాకా 300 కు పైగా పంజాబీ సాంగ్స్ కు వర్క్ చేసినట్టుగా వెల్లడించారు. అలాగే ఈ సిరీస్లో చూపించిన ప్యాలెస్ తో పాటు అవసరమైన చోట మాత్రమే విఎక్స్ వర్క్ ఉపయోగించామని, రామోజీ ఫిలిం సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ లొకేషన్లలో సినిమాను చిత్రీకరించామని వెల్లడించారు.


Read Also: మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?