ఫిబ్రవరిలో పలు మోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. అందులో సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసిన కొత్త సినిమాలు 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం', 'గేమ్ ఛేంజర్' వంటి సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా ఫిబ్రవరిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. 


గేమ్ ఛేంజర్ 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జె సూర్య లీడ్ రోల్స్ పోషించిన పొలిటికల్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ మీరు గనక పొలిటికల్ యాక్షన్ సినిమాలను ఇష్టపడితే త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కబోతున్న 'గేమ్ ఛేంజర్' మూవీని చూడాల్సిందే. అయితే ఈ మూవీ ఫిబ్రవరి రెండో వారంలో అంటే వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటిదాకా 'గేమ్ ఛేంజర్' డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇక 'గేమ్ ఛేంజర్' మూవీ అవినీతి వ్యవస్థపై పోరాడే ఒక ఐఏఎస్ అధికారి జీవితం చుట్టూ తిరుగుతుంది. ఇందులో చెర్రీ డ్యూయల్ రోల్ పోషించారు. 


సంక్రాంతికి వస్తున్నాం 
వెంకటేష్ దగ్గుబాటి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'.  ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది. అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాలలో 'సంక్రాంతికి వస్తున్నాం' పొంగల్ విన్నర్ గా నిలిచింది. ఈ మూవీ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ లైఫ్ చుట్టూ తిరుగుతుంది. అతను తన భార్యతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న టైంలో, మాజీ ప్రేయసి ఎంట్రీ ఇవ్వడంతో మూవీ టర్న్ తిరుగుతుంది. ఓ హై ప్రొఫైల్ కిడ్నాప్ కేస్ కోసం హీరోని మాజీ ప్రేయసి హెల్ప్ అడగడానికి వస్తుంది. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటించింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి రెండో వారంలోనే జీ5లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. 


Also Read: డాక్యుమెంటరీ వివాదంలో నయనతారకు షాక్... నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ రిజెక్ట్ చేసిన కోర్ట్


డాకు మహారాజ్ 
పీరియాడిక్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే తెలుగు మూవీ లవర్స్ ఫిబ్రవరిలో చూడాల్సిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ 'డాకు  మహారాజ్'. ఈ బ్లాక్ బస్టర్ మూవీలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా, ఊర్వశి రౌతెల, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాబి కొల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీని జనవరి 12న థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఓ గ్రామాన్ని క్రూరమైన వ్యక్తుల నుంచి రక్షించడానికి డాకు అనే దొంగ ఏం చేశాడు? అనేది ఈ మూవీ స్టోరీ. సమాచారం ప్రకారం 'డాకు మహారాజ్' మూవీ ఫిబ్రవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి కానుక రిలీజ్ అయిన 3 పెద్ద సినిమాలు కూడా ఫిబ్రవరిలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుండడం విశేషం.


Also Read'దిల్' రాజుకు రామ్ చరణ్ మరో సినిమానా? సారీ... ప్రజెంట్ కమిట్మెంట్ ఏదీ లేదు