నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌లో మూడో ఎపిసోడ్ నవంబర్ 4వ తేదీన స్ట్రీమ్ కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో విడుదల అయింది. శర్వానంద్, అడివి శేష్‌లు ఈ ఎపిసోడ్‌లో గెస్ట్‌లు వ్యవహరించనున్నారు.
బాలకృష్ణ చేసుకున్న ఒక పార్టీ గురించి శర్వానంద్ ఈ ప్రోమోలో చెప్పారు. ఐదున్నర నిమిషాల నిడివి ఉన్న ఒక పాటకు బాలకృష్ణ, ఒక అమ్మాయి డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారని, అయితే మూడున్నర నిమిషాలు అవ్వగానే ఆ అమ్మాయి ఆగిపోయిందని శర్వా అన్నారు. బాలకృష్ణ మాత్రం ఆ పాట అయిపోగానే ఇంకో పాట వేయమన్నారని, అదీ ఆయన ఎనర్జీ అని పాత సంఘటనను శర్వా గుర్తు చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పవద్దు, ప్లీజ్ అంటూ బాలకృష్ణ, శర్వాను కామెడీగా రిక్వెస్ట్ చేశారు.
ఇంతకు ముందు ప్రోమోలో రష్మికకు శర్వా వీడియో కాల్ చేసి బాలకృష్ణతో మాట్లాడించారు. రష్మికపై అభిమానాన్ని ఇంతకు ముందు కూడా బాలకృష్ణ బయట పెట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో కలిసి 'పుష్ప' విడుదల సమయంలో 'అన్‌స్టాపబుల్'కు వచ్చారు రష్మిక. అప్పుడు బాలకృష్ణ ఆమెతో చాలా సరదాగా మాట్లాడారు. ఒక విధంగా ఫ్లర్ట్ చేశారు. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్ 2'లో కూడా రష్మిక అంటే క్రష్ అన్నారు. అందుకని, ఆమెతో బాలకృష్ణ వీడియో కాల్ లైన్ కలిపారు శర్వానంద్. అదీ సంగతి!
'అన్‌స్టాపబుల్ 2' మూడో ఎపిసోడ్‌కు యువ కథానాయకులు, తెలుగు చిత్రసీమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ శర్వానంద్ (Sharwanand), అడివి శేష్ (Adivi Sesh) వచ్చారు. ఆహా ఓటీటీలో నవంబర్ 4న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. లేటెస్టుగా ప్రోమో (Unstoppable 2 Episode 3 Promo) విడుదల చేశారు. అందులో రష్మిక వీడియో కాల్ చేసిన విషయాన్ని బయట పెట్టారు. ఏం మాట్లాడారనేది తెలియాలంటే ఎపిసోడ్ విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాలి. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో శ్వరా, రష్మిక జంటగా నటించారు.
'అన్‌స్టాపబుల్ 2'కు వచ్చిన అడివి శేష్, బాలకృష్ణ పాదాలపై పడి నమస్కరించారు. 'చిన్న పిల్లలు దేవుడితో సమానం. అలా కాళ్ళ మీద పడిపోకూడదు' అని బాలయ్య అంటే... 'పెద్ద వాళ్ళు దేవుడితో సమానం అని విన్నాను' అని అడివి శేష్ బదులు ఇచ్చారు. అప్పుడు శర్వానంద్ ''ఆయన పేరు బాలయ్య. ఆయన ఎప్పటికీ బాలయ్యే (బాలుడు)'' అని చెప్పారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... యువ హీరోలు ఇద్దరితో కలిసి బాలుడిలా బాలకృష్ణ సందడి చేశారు.