Balakrishna Rashmika : బాలకృష్ణకు రష్మిక వీడియో కాల్

నట సింహం నందమూరి బాలకృష్ణకు రష్మిక వీడియో కాల్ చేశారు. నేషనల్ క్రష్ అంటే తనకూ క్రష్ అని బాలకృష్ణ చెప్పిన మాట ఆవిడ వరకు చేరింది. వీడియో కాల్ వెనుక రీజన్ అదే!

Continues below advertisement

రష్మిక మందన్నా (Rashmika Mandanna) ను నేషనల్ క్రష్ అని ఆమె అభిమానులు, ప్రేక్షకులు అంటుంటారు. ఆ అభిమానుల జాబితాలో నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా ఉన్నారు. 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లో రష్మిక అంటే క్రష్ అని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. ఆ విషయం ఆమె వరకు చేరింది. దాంతో బాలయ్యకు వీడియో కాల్ చేశారు. 

Continues below advertisement

బాలకృష్ణకు రష్మిక వీడియో కాల్!
రష్మికపై అభిమానాన్ని ఇంతకు ముందు కూడా బాలకృష్ణ బయట పెట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో కలిసి 'పుష్ప' విడుదల సమయంలో 'అన్‌స్టాపబుల్'కు వచ్చారు రష్మిక. అప్పుడు బాలకృష్ణ ఆమెతో చాలా సరదాగా మాట్లాడారు. ఒక విధంగా ఫ్లర్ట్ చేశారు. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్ 2'లో కూడా రష్మిక అంటే క్రష్ అన్నారు. అందుకని, ఆమెతో బాలకృష్ణ వీడియో కాల్ లైన్ కలిపారు శర్వానంద్. అదీ సంగతి!

శేష్, శర్వాతో బాలయ్య ఫుల్ ఫన్!
'అన్‌స్టాపబుల్ 2' మూడో ఎపిసోడ్‌కు యువ కథానాయకులు, తెలుగు చిత్రసీమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ శర్వానంద్ (Sharwanand), అడివి శేష్ (Adivi Sesh) వచ్చారు. ఆహా ఓటీటీలో నవంబర్ 4న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. లేటెస్టుగా ప్రోమో (Unstoppable 2 Episode 3 Promo) విడుదల చేశారు. అందులో రష్మిక వీడియో కాల్ చేసిన విషయాన్ని బయట పెట్టారు. ఏం మాట్లాడారనేది తెలియాలంటే ఎపిసోడ్ విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాలి. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో శ్వరా, రష్మిక జంటగా నటించారు. 

బాలయ్య ఎప్పటికీ బాలుడే!
'అన్‌స్టాపబుల్ 2'కు వచ్చిన అడివి శేష్, బాలకృష్ణ పాదాలపై పడి నమస్కరించారు. 'చిన్న పిల్లలు దేవుడితో సమానం. అలా కాళ్ళ మీద పడిపోకూడదు' అని బాలయ్య అంటే... 'పెద్ద వాళ్ళు దేవుడితో సమానం అని విన్నాను' అని అడివి శేష్ బదులు ఇచ్చారు. అప్పుడు శర్వానంద్ ''ఆయన పేరు బాలయ్య. ఆయన ఎప్పటికీ బాలయ్యే (బాలుడు)'' అని చెప్పారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి...  యువ హీరోలు ఇద్దరితో కలిసి బాలుడిలా బాలకృష్ణ సందడి చేశారు.

హీరోయిన్లు... షూటింగులు... పెళ్లిళ్లు!
శర్వానంద్, అడివి శేష్‌తో షూటింగులు, హీరోయిన్లు, పెళ్లిళ్లు... ఒక్కటేమిటి, చాలా విషయాలు బాలకృష్ణ డిస్కస్ చేశారు. ఆయనపై శర్వా ఓ పంచ్ వేయగా... 'ఇవన్నీ బీ సెంటర్ తెలివితేటలు' అని బాలయ్య రివర్స్ కౌంటర్ ఇచ్చారు. 'రన్ రాజా రన్'లో శ్వరా, శేష్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. తన సీన్లు కట్ చేశారని శేష్ అన్నారు. 'ఏది కట్ చేశామో చెప్పు' అని శ్వరా అడిగారు. ప్రోమో అంతా సరదా సరదాగా సాగింది.

పూజాతో ముద్దు వద్దు!
''ఈవిడతో కిస్ వద్దురా బాబోయ్ అనుకునే హీరోయిన్ ఎవరు?'' అని బాలకృష్ణ అడిగితే... 'పూజా హెగ్డే' అని అడివి శేష్ చెప్పారు. ఎందుకో మరి! 'ఓకే జాను' సినిమా సమయంలో తనకు అయిన యాక్సిడెంట్ గురించి శర్వానంద్ మాట్లాడారు. 'సెల్ఫీ అడిగితే చెంప పగలకొట్టే హీరో ఎవరు?' అని బాలకృష్ణ అడిగారు. అది ఎవరిని ఉద్దేశించి అనేది ప్రత్యేకంగా చెప్పాలా? తనపై తాను సెటైర్స్ వేసుకుంటూ బాలకృష్ణ షోను ఎంటర్‌టైనింగ్‌గా మారుస్తున్నారు.   

Also Read : బాలకృష్ణ సంస్కారానికి ప్రేక్షకులు ఫిదా - ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో విజయలక్షికి అవార్డు

Continues below advertisement
Sponsored Links by Taboola