This Week Theatrical OTT Movies Web Series Complete List : ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు సందడి చేయనుండగా... ఓటీటీల్లో రీసెంట్ హిట్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. జూన్ ఫస్ట్ వీక్‌లో రామ్ చరణ్ పెద్ది మూవీతో పాటు వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ 'హై జవానీతో ఇష్క్ హోనా హై' జూన్ 5న థియేటర్లలోకి రానుంది. అటు, ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కానున్నాయి.

Continues below advertisement

రణవీర్ 'ధురంధర్ 2'

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ధురంధర్ 2'. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ వేదికగా జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో రానుంది.

Continues below advertisement

మమ్ముట్టి 'పేట్రియాట్'

మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ అండ్ స్పై మూవీ పేట్రియాట్. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేయగా... మోహన్ లాల్ కీలకపాత్ర పోషించారు. ప్రముఖ ఓటీటీ ZEE5లో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

'కేడీ: ది డెవిల్'

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు, కన్నడ స్టార్ ధ్రువ్ సర్జా హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కేడీ : ది డెవిల్'. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సినిమాలో కీలకపాత్ర పోషించారు. రిలీజ్‌కు ముందే సర్కే చునార్ సాంగ్ కాంట్రవర్సీ కాగా... జూన్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమా అందుబాటులోకి రానుంది.

Also Read : Raaka Update : అల్లు అర్జున్ రాకాలో మలయాళ బ్యూటీ - అసలెవరీ ఫెమినా జార్జ్... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

అమెజాన్ ప్రైమ్ వీడియో : మేడిన్ ఇండియా (తెలుగు డబ్బింగి సిరీస్ - జూన్ 3), కార్మేని సెల్వం (తమిళ డబ్బింగ్ మూవీ - జూన్ 3), ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 3), క్లార్క్‌సన్ ఫార్మ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 3), ది పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్ - జూన్ 5), స్పైడర్ నోయిర్ (వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది), లీడర్ (తమిళ మూవీ స్ట్రీమింగ్), భీమ్ సేరి, పైసావాలా, నవాబ్స్ కేఫ్, సీట్ ఎడ్జ్ (కన్నడ మూవీ - స్ట్రీమింగ్), మెర్‌మెయిడ్ (ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్).

నెట్ ఫ్లిక్స్ : మా బెహన్ (తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 3), ద మర్డర్ ఆఫ్ రేచల్ నికల్ (ఇంగ్లీష్ మూవీ - జూన్ 4), 29 (తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 5), మెక్సికో 86 (స్పానిష్ మూవీ - జూన్ 5), ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లిష్ మూవీ - జూన్ 5), ద మార్క్‌డ్ ఉమెన్ (స్పానిష్ మూవీ - జూన్ 5), టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్ - జూన్ 5), యూఎస్ఏ 94 (జూన్ 7), ది బ్లడ్ సిస్టర్స్ (జూన్ 5), కర (తెలుగు డబ్బింగ్ - స్ట్రీమింగ్ అవుతోంది)

ZEE5 : పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 5), బ్రౌన్ (హిందీ సిరీస్ - జూన్ 5), కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 5), డ్రింకర్ సాయి (తెలుగు మూవీ).

జియో హాట్ స్టార్ : ధురంధర్ 2 (జూన్ 4), కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (మలయాళం తెలుగు వెబ్ సిరీస్)

యాపిల్ టీవీ : కేప్ ఫియర్ (జూన్ 5).

Also Read : Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.