Siddu Moolimani's Horror Thriller Seat Edge Streaming On Amazon Prime Video : హారర్ థ్రిల్లర్స్ అంటే మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ సీట్ ఎడ్జ్ మూమెంట్స్ చాలా వరకూ ఉంటాయి. చూసే ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. అలాంటి కంటెంట్‌తో ఓటీటీలోకి వచ్చింది రీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సైకలాజికల్ సిట్యుయేషన్ హారర్ థ్రిల్లర్ టైటిల్ సీట్ ఎడ్జ్. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 4 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో కన్నడతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
చేతన్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్దు మూలిమణి, రవిక్షా శెట్టి, రఘు రమణకొప్ప, గిరీష్ శివన్న తదితరులు కీలకపాత్రలు పోషించారు. NR సినిమా ప్రొడక్షన్స్‌పై మూవీని నిర్మించారు.
Also Read : Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీతో మూవీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రియాక్షన్
స్టోరీ ఏంటంటే?
ఓ యూట్యూబ్ వ్లాగర్ అనుకోకుండా క్లోజ్డ్ స్పేస్‌లో చిక్కుకుంటే ఏం జరిగింది అనేదే ప్రధానాంశంగా మూవీని తెరకెక్కించారు. వైరల్ కంటెంట్‌తో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫేమస్ అవ్వాలని ఆశపడతాడు సిద్ధు (సిద్ధు మూలిమణి). అయితే, ఎంత ట్రై చేసినా అతను అనుకున్న వ్యూస్ రావు. దీంతో హారర్, దెయ్యాలకు సంబంధించిన కంటెంట్‌కు ఎక్కువ క్రేజ్ ఉందని అలాంటి వీడియోలు ట్రై చేస్తుంటాడు.
అలాంటి ఓ వీడియో కోసం ప్లాన్ చేసి ఓ రహస్య ప్రదేశంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రహస్య ప్రదేశంలో ఏముంది? అక్కడి నుంచి సిద్ధు ప్రాణాలతో బయటపడ్డాడా? అతనికి సాయం చేసింది ఎవరు? తాను కోరుకున్నట్లుగానే ఆ వీడియోతో ఫేమస్ అయ్యాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : Peddi: 'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా
