Godari Gattupaina Saraswathi Movies OTT Streaming On Two Platforms : ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేయగా... ఓటీటీల్లో కొత్త మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు రెండు ప్లాట్ ఫామ్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. అవేంటో ఓసారి చూస్తే...

Continues below advertisement

మరో ఓటీటీలో 'గోదారి గట్టుపైన'

మేమ్ ఫేమస్ ఫేం సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన రీసెంట్ రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా... మూడు వారాల్లోపే సడన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా మరో ఓటీటీ 'ఆహా'లోనూ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న మూవీ ఓటీటీల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Continues below advertisement

ఈ మూవీకి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా... సుమంత్, నిధిలతో పాటు రాజీవ్ కనకాల, జగపతిబాబు, లైలా, రీణు, దేవి ప్రసాద్, హర్షవర్దన్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అభినవ్ రావ్ మూవీని నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

ఆటో డ్రైవర్ రాజు (సుమంత్ ప్రభాస్) తన పేరెంట్స్, ఫ్రెండ్స్‌తో ఉన్న ఊరిలోనే ఆనందంగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. చెల్లెలి ఫ్రెండ్ మాయ (నిధి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. మాయ కూడా అతన్ని ఇష్టపడుతుంది. మాయ తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు) ఓ సెక్యూరిటీ గార్డు. అతనంటే ఊరంతటికీ భయం. రాజు, మాయల విషయం తెలుసుకున్న శ్యాంబాబు ఏం చేశాడు? రాజు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజుకు ముద్దు పెట్టిన తర్వాత మాయ ఎందుకు దూరమైంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్

సైకలాజికల్ థ్రిల్లర్ 'సరస్వతి'

హీరోయిన్ వరలక్ష్మి  శరత్ కుమార్ స్వీయ దర్శకత్వం వహిస్తూనే లీడ్ రోల్‌లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సరస్వతి. మార్చి 6న థియేటర్లలోకి వచ్చిన సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తాజాగా... 'ఈటీవీ విన్'లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ మూవీలో వరలక్ష్మితో పాటు జీవా, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మురళీ శర్మ, ప్రియమణి కీలకపాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించగా... తమ సొంత బ్యానర్‌పై వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్ నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పని చేసే లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) తన కుమార్తె సరస్వతిని ఆగస్ట్ 15న స్కూల్ వద్ద డ్రాప్ చేసి వెళ్తుంది. సాయంత్రం వెళ్లే సరికి అమ్మాయి స్కూల్‌లో ఉండదు. అసలు ఆమె తమ స్కూల్‌లోనే చదవడం లేదని టీచర్స్ చెబుతారు. అయితే, సాయంత్రానికి తన అమ్మకు ఫోన్ చేసిన సరస్వతి తనపై ప్రిన్సిపాల్, మరో ఇద్దరు అఘాయిత్యం చేశారని చెబుతుంది.

ఆధారాలు లేవని పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. నిజాయతీ లాయర్ రామానుజమ్ (ప్రకాశ్ రాజ్) ఆమెకు సపోర్ట్‌గా కోర్టుకు వెళ్తారు. అసలు లక్ష్మి ఎవరు? సరస్వతి ఉందా లేదా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Lokesh Kanagaraj Universe : లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రవి మోహన్ - కాంట్రవర్సీస్ తర్వాత ఫస్ట్ టైం

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.