Best Thriller Movies On OTT: థ్రిల్లింగ్ సినిమాలు తెరకెక్కించి, వాటికి ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టడం అంత ఈజీ కాదు. కానీ ఈ 10 దక్షిణాది చిత్రాలు మాత్రం థ్రిల్లర్ లవర్స్ నుండి పాజిటివ్ రివ్యూలను అందుకుంటున్నాయి.


రత్సాసన్


తమిళ చిత్రాల్లో బెస్ట్ థ్రిల్లర్ మూవీ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ‘రత్సాసన్’. చాలా థ్రిల్లర్ సినిమాలలాగా ‘రత్సాసన్’ కూడా ఒక సైకో కిల్లర్ కథ. కానీ ఈ మూవీ స్క్రీన్ ప్లే మాత్రం మిగతా థ్రిల్లర్స్ నుండి దీనిని వేరు చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యేలా చేసింది. రామ్ కుమార్ దర్శకత్వంలో విష్ణు విశాల్, అమలా పాల్, శరవణన్ లీడ్ రోల్స్‌ చేసిన ఈ చిత్రం.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. దీనినే తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.


దృశ్యం


మలయాళం అంటే కేవలం ఫీల్ గుడ్ సినిమాలే అనుకునే ప్రేక్షకుల దృష్టికోణాన్నే మార్చింది ‘దృశ్యం’. మోహన్ లాల్ లీడ్ రోల్‌గా చేసిన ఈ థ్రిల్లర్.. తెలుగు, హిందీలో కూడా ఇదే టైటిల్‌తో రీమేక్ అయ్యింది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. మలయాళంలో మరిన్ని థ్రిల్లర్స్ తెరకెక్కేలా ప్రోత్సహించింది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.


ఖైదీ


అసలు హీరోయిన్ లేకుండా ఏ జోనర్ సినిమా అయినా ఉంటుందా, అలా ఉన్నా వర్కవుట్ అవుతుందా అని అనుమానించే ప్రేక్షకులకు గట్టి సమాధానమిచ్చింది ‘ఖైదీ’. 2019లో కార్తి హీరోగా లోకేశ్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో ఒక ఖైదీ చేతికి పోలీసుల ప్రాణాలు కాపాడే బాధ్యత వెళ్లడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.


సైరెన్


మామూలుగా సౌత్ భాషల్లో తెరకెక్కే వెబ్ సిరీస్‌ల సంఖ్య చాలా తక్కువ. కానీ త్వరలోనే ఒక తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘సైరెన్’. ఇందులో కీర్తి సురేశ్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ చేయగా ఏప్రిల్ 11న ఇది స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది.


తునివు


తమిళంలో హెచ్ వినోద్, అజిత్ కాంబినేషన్ సూపర్ హిట్ అని చాలామంది ప్రేక్షకులకు తెలుసు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అజిత్‌తో పాటు మంజు వారియర్, సముద్రఖని, జాన్ కొక్కేన్, అజయ్.. ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రస్తుతం ఈ తమిళ థ్రిల్లర్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.


కాంతార


కొన్నేళ్లుగా కన్నడ సినీ పరిశ్రమకు మూవీ లవర్స్ నుండి ఎనలేని ఆదరణ లభిస్తోంది. దానికి ‘కాంతార’ చిత్రం కూడా ఒక కారణమే. దేవుడి స్టోరీ లైన్‌తో తెరకెక్కిన ఈ మూవీని పలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జతచేశాడు రిషబ్ శెట్టి. ఈ మూవీని తను డైరెక్ట్ చేయడమే కాకుండా హీరోగా కూడా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ముందుగా కేవలం కన్నడలోనే విడుదలయిన ఈ చిత్రం.. మెల్లగా అన్ని భాషల్లో డబ్ అయ్యింది. ప్రస్తుతం ‘కాంతార’.. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.


పొర్ తొరిల్


‘పొర్ తొరిల్’ అనేది కొంతమంది పోలీసులు కలిసి ఒక సైకో కిల్లర్‌ను పట్టుకునే కథ. మామూలుగా ఈ స్టోరీ లైన్‌తో ఎన్నో సినిమాలు తెరకెక్కినా కూడా ఈ చిత్రాన్ని తన స్క్రీన్ ప్లేతో థ్రిల్లింగ్‌గా మార్చాడు విఘ్నేష్ రాజా. శరత్ కుమార్, అశోక్ సెల్వన్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ.. 2023లో విడుదలయిన బెస్ట్ తమిళ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఇది సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతోంది.


ఇన్‌స్పెక్టర్ రిషి


నవీన్ చంద్ర టైటిల్ పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ హారర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. జేఎస్ నందిని డైరెక్ట్ చేసిన ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు పాజిటివ్ రివ్యూలు వస్తుండగా.. థ్రిల్లర్ లవర్స్‌ను కూడా ఇది విపరీతంగా ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.


దసరా


‘దసరా’ కోసం మొదటిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించాడు నేచురల్ స్టార్ నాని. డెబ్యూ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా మూవీ ఎక్కువగా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.


Also Read: క్రేజీ అప్‌డేట్‌ - నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్న 'టిల్లు స్క్వేర్‌'? స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!