'గూడచారి' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత ధూళిపాళ్ల ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఈ మధ్యకాలంలో శోభిత బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అందుకు కారణం వెబ్ సిరీస్లలో శోభిత తన గ్లామర్ ని ఓ రేంజ్ లో ఒలకబోస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన హిందీ వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్'(The Night Manager) ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ అగ్ర హీరో ఆదిత్య రాయ్ కపూర్, సీనియర్ నటుడు అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించగా అనిల్ కపూర్ భార్యగా ఇందులో శోభిత ధూళిపాళ్ల కనిపించింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో శోభిత తన గ్లామర్ తో ఆకట్టుకుంది.


కాగా రెండు భాగాలుగా రూపొందిన 'ది నైట్ మేనేజర్' మొదటి భాగం ఫిబ్రవరిలో విడుదల కాగా రెండో భాగం తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న 'ది నైట్ మేనేజర్ పార్ట్ 2' కి సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే పార్ట్ వన్ లో తన గ్లామర్ ని శాంపిల్ గా మాత్రమే చూపించిన శోభిత ఇప్పుడు పార్ట్ 2 లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ముఖ్యంగా పార్ట్ 2 లో ఆదిత్య రాయయ్ కపూర్ తో  శోభిత చేసిన శృంగార సన్నివేశం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. లిప్ కిస్సులు, బెడ్ సీన్స్ తో హీటెక్కించే పర్ఫామెన్స్ చేసింది శోభిత. ప్రస్తుతం ఈ శృంగార సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


వీటిని చూసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. 'శోభితా ఈ రేంజ్ లో రెచ్చిపోయింది ఏంటి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే శోభితను ట్రోల్స్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' లలో తమన్న కూడా శృంగార సన్నివేశంలో నటించి హాట్ టాపిక్ అవ్వగా.. ఇప్పుడు తమన్నాను మించి శోభిత రెచ్చిపోయిందంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పార్ట్ వన్ లో కేవలం బికినీ అందాలు మాత్రమే చూపించిన శోభిత, ఇప్పుడు పార్ట్ 2 లో మాత్రం తెగించేసిందంటూ చెబుతున్నారు. దాంతో ఆదిత్య రాయ్ కపూర్, శోభిత దూళిపాళ్ల ఇద్దరిపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. కాగా మరికొందరేమో శోభితా గ్లామర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సిరీస్లో శోభిత మరింత స్టన్నింగ్ కనిపించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇక 'ది నైట్ మేనేజర్'(The Night Manager) సిరీస్ విషయానికి వస్తే..  జాన్ లీ కారీస్ నవల ఆధారంగా 2016 లో రూపొందించబడిన బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ 'ది నైట్ మేనేజర్' కి ఇది హిందీ రీమేక్ గా తెరకెక్కింది. బాలీవుడ్ డైరెక్టర్ సందీప్ మోడీ ఈ సిరీస్ ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. సామ్ సీఎస్ ఈ వెబ్ సిరీస్ కి సంగీతం అందించారు. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.


Also Read : శ్రీకాంత్ అడ్డాల మాస్ ప్రయత్నం - ‘పెదకాపు-1’ టీజర్ వచ్చేసింది!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial