Tamannaah-Vijay Varma Love: తమన్నా, విజయ్‌ల లవ్ స్టోరీ అలా మొదలైందట - అసలు విషయం చెప్పేసిన ‘లస్ట్ స్టోరీస్ 2’ దర్శకుడు

తమన్నా, విజయ్ వర్మ లవ్ స్టోరీ గురించి దర్శకుడు సుజోయ్ ఘోష్ తొలిసారి స్పందించారు. అయితే, రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి కాకుండా, వీరిద్దరి రీల్ లవ్ స్టోరీ ఎలా మొదలయ్యిందో వివరించే ప్రయత్నం చేశారు.

Continues below advertisement

మన్నా, విజయ్ వర్మ లవ్ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కొంత కాలంగా వీరిద్దరి గురించి బోలెడన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గోవా వేదికగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యే తమ ప్రేమ గురించి తమన్నాతో పాటు విజయ్ వర్మ కూడా కన్ఫామ్ చేశారు. రీసెంట్ గా వీరిద్దరు కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. ఇందులో అడల్ట్ సీన్లు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ మూవీలో పలువురు స్టార్ హీరోయిన్లు నటించినా, తమన్నా, విజయ్ క్యారెక్టర్ల మీదే ప్రేక్షకులకు మరింత ఆసక్తిక కలిగించింది.  

Continues below advertisement

‘లస్ట్ స్టోరీస్ 2’ కంటే ముందే ప్రేమలో తమన్నా, విజయ్? 

అటు ఇప్పటికీ విజయ్, తమన్నా ప్రేమ కథ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రమోషన్ లో భాగంగా వీరిద్దరి ప్రేమ కథ గురించి దర్శకుడు సుజోయ్ ఘోష్ పలు విషయాలు వెల్లడించారు. అయితే, తను వీరి రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి కాకుండా, ‘లస్ట్ స్టోరీస్ 2’లో వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యిందో వివరించే ప్రయత్నం చేశారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ చేయాలి అనుకుంటున్న సమయంలోనే వీరిద్దరి ప్రేమకథ గురించి బయటకు తెలిసిందని, అదే సమయంలో వీరిద్దరిని ఈ వెబ్ సిరీస్ లో భాగం చేస్తే బాగుంటుందని భావించినట్లు ఆయన వెల్లడించారు. ఇద్దరికీ విషయం చెప్పగానే, వారి నుంచి సరే అనే సమాధానం వచ్చిందన్నారు. స్క్రిప్ట్ ఇవ్వగానే ఇద్దరికీ నచ్చింది. అయితే, ఓకే చెప్పే ముందు తమన్నా, విజయ్ పలు విషయాల గురించి చర్చించుకున్నట్లు చెప్పారు. చివరకు ఇద్దరు కలిసి గేమ్ ఆన్ అనే సమాధానం చెప్పారని వెల్లడించారు. ఆ తర్వాత వీరిద్దరి రీల్ లైఫ్ లవ్ స్టోరీ కూడా మొదలైందని సుజోయ్ ఘోష్ వివరించారు.

నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ 2’ స్ట్రీమింగ్

‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’లో నాలుగు కథల్ని చూపించారు. వీటిలో ఒక్కో కథకు ఒక్కొక్కరు దర్శకత్వం వహించారు.  'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ ని సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ నలుగురు దర్శకులు తెరకెక్కించారు. తమన్నా, విజయ్ వర్మ సెగ్మెంట్ కు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.  తమన్నా, మృనాల్ ఠాకూర్ విజయ్ వర్మ, అమృతా సుభాష్, అంగద్ బేడీ,కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, తిలోత్తమా షోమే నటించారు.  జూన్ 29న ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఇక తమన్నా  సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా,  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్‌’ సినిమాలో నటిస్తోంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also: రాత్రికి రాత్రే హన్సికలా మారిపోయిన యోగిబాబు - నవ్వులు పూయిస్తున్న ఆది పినిశెట్టి ‘పార్టనర్’ ట్రైలర్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement