The Great Pre Wedding Show OTT Platform Streaming Date Details: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ తిరువీర్ హీరోగా నటించిన తాజా సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఓటీటీలో సందడి చేయనుంది. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు.
డిసెంబర్ 7 నుంచి ఓటీటీలోకి...సినిమా స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5' సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. అంటే... డిసెంబర్ మొదటి వారంలో, 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు 'జీ 5' తెలిపింది.
అసలు కథ, కార్డు మిస్సింగ్ కహాని ఏమిటి?'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కథ విషయానికి వస్తే... చిన్న పల్లెటూరిలో ఓ ఫొటోగ్రాఫర్ ఉంటాడు. అతని పేరు రమేష్. తమ గ్రామానికి చెందిన లోకల్ లీడర్ ఆనంద్ (నరేంద్ర రవి) ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. లక్షలు ఖర్చుపెట్టి షూట్ చేశాక... కెమెరా నుంచి తీసిన షాపులో పనిచేసే కుర్రాడికి ఇచ్చిన మెమురీ కార్డు పోతుంది. ఆ విషయం ఆనంద్ & అతనికి కాబోయే భార్యకు చెప్పారా? రమేష్ ఎన్ని తిప్పలు పడ్డాడు? అతనికి హేమ (టీనా శ్రావ్య) ఎటువంటి సాయం చేసింది? అనేది సినిమా.
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'లో తిరువీర్ జంటగా టీనా శ్రావ్య నటించారు. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. ఆయనకు తొలి చిత్రమిది. కల్పనా రావు సహ నిర్మాత. నరేంద్ర రవి, మాస్టర్ రోహన్ ఇతర కీలక పాత్రలలో నటించారు.
Also Read: '12ఏ రైల్వే కాలనీ' రివ్యూ: అల్లరోడికి 'పొలిమేర' అనిల్ హిట్ ఇచ్చారా? హారర్ థ్రిల్లర్ బావుందా?
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు అయిన సందర్భంగా హీరో తిరువీర్ మాట్లాడుతూ... ''మన పల్లెటూరు, పట్టణాల్లో చూసే యువకుడిలా నేను పోషించిన రమేష్ పాత్ర ఉంటుంది. అతని అమాయకత్వం, ఆందోళన, చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. మా చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. ఓటీటీలోనూ సినిమా చూసిన ప్రేక్షకులను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. 'జీ 5'లో మా సినిమా విడుదల అవుతుండటం సంతోషంగా ఉంది'' అని అన్నారు.