12A Railway Colony Review - '12ఏ రైల్వే కాలనీ' రివ్యూ: అల్లరోడికి 'పొలిమేర' అనిల్ హిట్ ఇచ్చారా? హారర్ థ్రిల్లర్ బావుందా?

12A Railway Colony Review In Telugu: 'అల్లరి' నరేష్, కామాక్షి భాస్కర్ల జంటగా 'పొలిమేర' సిరీస్ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథతో రూపొందిన సినిమా '12ఏ రైల్వే కాలనీ'. ఈ మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

Continues below advertisement

Allari Naresh and Kamakshi Bhaskarla's 12A Railway Colony Movie Review: 'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా '12ఏ రైల్వే కాలనీ'. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. 'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించారు. మైండ్ గేమ్ నేపథ్యంలో నడిచే ఈ మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

Continues below advertisement

కథ (12A Railway Colony Story): కార్తీక్ (అల్లరి నరేష్) అనాథ. స్నేహితులు (హర్ష చెముడు, గెటప్ శ్రీను, సద్దాం)తో కలిసి రాజకీయ నాయకుడు టిల్లు (జీవన్ కుమార్) దగ్గర తిరుగుతుంటాడు. పక్కన ఇంటిలో ఉండే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను ప్రేమిస్తాడు. ఆమె మంచి బాడ్మింటన్ ప్లేయర్. సింగపూర్ టోర్నమెంట్‌కు వెళ్లడానికి మూడు లక్షలు అవసరం అని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓ రోజు అనుకోకుండా ఆరాధన ఇంటికి వెళ్లిన కార్తీక్... షాక్ అవుతాడు.

ఆరాధనతో పాటు ఆమె తల్లి మరణించి ఉంటుంది. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రానా ప్రతాప్ (సాయి కుమార్) ఎలా సాల్వ్ చేశారు? ముంబైలో జయదేవ్ షిండే (అనీష్ కురువిల్లా)కు, ఆరాధనకు సంబంధం ఏమిటి? టిల్లు ఏం చేశాడు? అసలు ఆరాధనతో పాటు వాళ్ళ అమ్మను చంపింది ఎవరు? అనేది సినిమా.

విశ్లేషణ (12A Railway Colony Review Telugu): క్లైమాక్స్‌ ఒక్కటీ బాగా రాస్తే... రెండు మూడు ట్విస్టులు ఎండింగ్‌లో ఇస్తే చాలు... అప్పటి వరకు ఎన్ని మిస్టేక్స్ చేసినా ప్రేక్షకులు క్షమిస్తారనే ఆలోచనా ధోరణి నుంచి దర్శక రచయితలు బయటకు రావాలి. 'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' విజయాలు సాధించడానికి కారణం ఎండింగ్స్ కాదు... ముందు నుంచి చెప్పిన కథ. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఆ సంగతి మర్చినట్టు ఉన్నారు. క్లైమాక్స్ మీద కాన్సంట్రేట్ చేసి మిగతా సినిమాను వదిలేశారు.

సినిమా చూస్తున్నంత సేపూ అనిల్ విశ్వనాథ్ రాసిన కథేనా? 'పొలిమేర' రైటర్ & డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రొడక్టేనా? అని సందేహాలు కలుగుతూ ఉంటాయి. '12ఏ రైల్వే కాలనీ' బదులు 'పంజాగుట్ట', 'బంజారా హిల్స్' అని టైటిల్ పెట్టినా కథకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. సినిమాలో రైల్వే కాలనీకి ఇంపార్టెన్స్ లేదు. కథకు, ఆ పేరుకు సింక్ లేదు. టైటిల్ & స్టోరీకి సింక్ లేనట్టు... సన్నివేశాలకు, తమకు అసలు ఏమాత్రం సింక్ లేనట్టు ఆర్టిస్టులు చేశారు. అరువు తెచ్చుకున్నట్టు తెలంగాణ యాస మాట్లాడటం అసలు బాలేదు.

క్షుద్రపూజల నేపథ్యంలో సినిమాలకు లాజిక్కులు అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే మినిమమ్ లాజిక్స్ చూసుకోవాలి కదా. హారర్, థ్రిల్ ఎలిమెంట్స్ వదిలేయండి. మిగతావి ఆడియన్స్ పట్టించుకుంటారు కదా! మర్డర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ ఐదు వేలు ఇస్తే ఇతరుల ఫోన్ కాల్ రికార్డింగ్స్ పోలీసులు ఇచ్చేస్తారా? ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా!? పోనీ అవి వదిలేయండి... హీరో హీరోయిన్లకు ప్రోపర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉండాలి కదా! కథతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు అందించిన అనిల్ విశ్వనాథ్ గానీ, దర్శకుడు నాని గానీ ఆ సంగతి చూసుకోలేదు. స్టార్టింగ్ నుంచి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎగ్జైట్ చేయలేదు. ఎంటర్టైన్ చేయలేదు. థ్రిల్ ఇవ్వలేదు. క్లైమాక్స్ ఒక్కటీ... అదీ అభిరామి నటన వల్ల చూసేలా ఉంది.

Also Read: 'ప్రేమంటే' సినిమా రివ్యూ: ప్రియదర్శికి హిట్ వచ్చిందా? సుమ కనకాల కామెడీ ఎలా ఉంది?

భీమ్స్ సిసిరోలియో పాటల్లో మళ్ళీ వినాలనిపించేవి లేవు. నేపథ్య సంగీతం కూడా అంతే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ బాలేదు. సినిమా చూస్తుంటే చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో ముంబై వెళ్లినట్టు చూపించినప్పుడు ఆ ఫీల్ కలగాలి కదా! అటువంటిది ఏదీ లేదు. 

థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులకు గుర్తుండే పెర్ఫార్మన్స్ ఒక్క అభిరామిది మాత్రమే. క్లైమాక్స్‌ ముందు ఆవిడ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. స్క్రీన్ మీద ఉన్నంతసేపూ బెస్ట్ ఇచ్చారు. 'అల్లరి' నరేష్ నటనలో న్యాచురాలిటీ మిస్ అయ్యింది. ఏదో చేయాలి కాబట్టి చేసినట్టు అనిపిస్తుంది. కామాక్షి భాస్కర్లను డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో చూపించారు. అయితే ఆవిడకు నటించే స్కోప్ అంతగా దక్కలేదు. రెగ్యులర్ హీరోయిన్ రోల్ అది. డైలాగ్ కింగ్ సాయి కుమార్, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, హర్ష చెముడు, గెటప్ శ్రీను తదితరులు రొటీన్ రోల్స్ & సీన్స్ చేశారు.

'12ఏ రైల్వే కాలనీ'ని హారర్ థ్రిల్లర్ అని పేర్కొన్నారు. అయితే... ఇందులో హారర్ గానీ, థ్రిల్ గానీ అసలు లేవు. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ వస్తుంది. సినిమాలు చూసే ప్రేక్షకులు ఎవరైనా సరే అది మూడు నిమిషాల ముందు గుర్తిస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ బావుంది. క్లైమాక్స్ పది నిమిషాల కోసం థియేటర్లలో రెండు గంటలు కూర్చోవడం కష్టం. నో హారర్, నో థ్రిల్, నో పెర్ఫార్మన్స్... నీరసం ఫుల్.

Also Read'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?

Continues below advertisement
Sponsored Links by Taboola