నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్'. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించింది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు పాకిస్తాన్‌లోని నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ జాబితాలో చేరింది. రష్మిక సినిమాను పాకిస్తానీలు బాగా చూస్తున్నారు. 

Continues below advertisement

పాకిస్తాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో 'ది గర్ల్‌ఫ్రెండ్'ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో పాకిస్తాన్‌లో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో భారతీయ సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్' నంబర్ 1 స్థానంలో నిలిచిందని తెలిపింది. తెలుగులో సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చినా... హిందీ ఈ సినిమా విడుదలైనప్పుడు బాక్సాఫీస్‌ దగ్గర అంతగా ఆదరణ లభించలేదు. బాలీవుడ్ ఫ్లాప్ సినిమాల జాబితాలో చేరింది. కానీ ఇప్పుడు కేవలం ఇండియా నెట్‌ఫ్లిక్స్‌లోనే కాకుండా పాకిస్తాన్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఇండియన్ బాక్సాఫీస్‌లో ఫ్లాప్ అయిన తర్వాత ఓటీటీలో విడుదలైనప్పుడు ఉత్తరాది ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారు.

Also Read: Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

Continues below advertisement

'ది గర్ల్‌ఫ్రెండ్' కథ ఏమిటి? ఇందులో హీరో ఎవరు?'ది గర్ల్‌ఫ్రెండ్' ఒక సైకలాజికల్ రొమాంటిక్ సినిమా. ఇందులో ఒక కాలేజీ విద్యార్థి పాత్రను పోషించారు రష్మిక. ఆమె తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడుతుంది. నెమ్మదిగా అమ్మాయిని బాయ్‌ఫ్రెండ్ కంట్రోల్‌ చేయడం మొదలు పెడతాడు. దానివల్ల బంధం బీటలు వారుతుంది. బాయ్ ఫ్రెండ్ నుంచి గర్ల్‌ ఫ్రెండ్ ఎలా బయట పడింది? అనేది సినిమా. అందరూ రష్మిక మందన్న నటనను బాగా ప్రశంసించారు. ఆమెతో పాటు అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి, దీక్షిత్ శెట్టి వంటి స్టార్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. 

Also Read: 'ది లెజెండరీస్' to 'ఐస్ ఏజ్ 6' వరకు... 2026లో ఓటీటీ, థియేటర్లలోకి రాబోయే యానిమేటెడ్ సినిమాలు