Roshan Meka's Champion Movie OTT Deal Fixed : దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్'గా రాబోతున్నారు. ఆయన కెరీర్‌లో 'పెళ్లిసందD', 'నిర్మలా కాన్వెంట్' అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో గ్యాప్ తీసుకుని సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

ఓటీటీ... బిగ్ డీల్

రిలీజ్‌కు ముందే 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా... రూ.16 కోట్లకు ఓటీటీ డీల్ ముగిసినట్లు తెలుస్తోంది. ఫేమస్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ మిడ్ రేంజ్ సినిమాకు ఇది మంచి డీల్ అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ 'ఛాంపియన్' మూవీని రూపొందించింది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో రోషన్‌తో మరో మూవీ చేసేందుకు కూడా ఈ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ డైరెక్టర్ ఆ ప్రాజెక్టును డీల్ చేయబోతున్నట్లు సమాచారం.

Also Read : ఇయర్ ఎండింగ్ సూపర్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ - క్రిస్మస్ బరిలో యంగ్ హీరోస్ మూవీస్... ఓ లుక్కేయండి మరి!

క్రిస్మస్ సందర్భంగా...

మూవీలో రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమెకు టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ మూవీ. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించగా... ఒకప్పటి సీనియర్ హీరో నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్‌పై సినిమాను నిర్మించగా... క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.