This Week Telugu Movies In Theaters OTT Releases : ఇయర్ ఎండింగ్‌లో మూవీ లవర్స్‌కు ఫుల్ థ్రిల్ పంచేందుకు మూవీస్ రెడీ అయ్యాయి. హారర్, సూపర్ నేచరల్ థ్రిల్లర్స్ నుంచి స్పోర్ట్స్, హిస్టారికల్ డ్రామా వరకూ మూవీస్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకే రోజు 5 సినిమాల వరకూ క్రిస్మస్ సందర్భంగా రానున్నాయి. అటు ఓటీటీల్లోనూ మూవీస్, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. మరి ఆ లిస్ట్ ఓసారి చూస్తే...
ఆది నేచరల్ థ్రిల్లర్ 'శంబాల'
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ డిఫరెంట్ కాన్సెప్ట్ నేచరల్ థ్రిల్లర్ 'శంబాల'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైన్స్‌కు శాస్త్రానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తుండగా... ఆది సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రోషన్ 'ఛాంపియన్'
యంగ్ హీరో రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్ డ్రామా 'ఛాంపియన్'. చాలా గ్యాప్ తర్వాత స్వాతంత్ర్యం నాటి బ్యాక్ డ్రాప్ స్టోరీతో రోషన్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించగా... ఒకప్పటి స్టార్ హీరో నందమూరి కల్యాణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ నెల 25న మూవీ రిలీజ్ కానుంది.
Also Read : ఒకే పాటలో చిరు, వెంకీ స్టెప్పులు - 'మన శంకర వరప్రసాద్ గారు' సాంగ్ సూపర్ అప్డేట్
హారర్ థ్రిల్లర్ 'ఈషా'
హెబ్బా పటేల్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా'. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, వార్నింగ్ వీడియో భయపెడుతున్నాయి. ఆడియన్స్‌కు ఫుల్ హారర్ థ్రిల్లింగ్ పంచేందుకు ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించగా... హెబ్బా పటేల్, త్రిగుణ్‌లతో పాటు అఖిల్ రాజ్, సిరి, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలో పోషించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి మూవీని రిలీజ్ చేయనున్నారు.
సోషల్ డ్రామా 'దండోరా'
సమాజంలో అసమానతలు ప్రధానాంశంగా సెన్సిటివ్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న సోషల్ డ్రామా 'దండోరా'. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన మూవీలో శివాజీ, బిందు మాధవి, నవదీప్, మౌనికా రెడ్డి, రవికృష్ణ, అనూష, రాద్యా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హిస్టారికల్ డ్రామా 'వృషభ'
మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ డ్రామా 'వృషభ'. తండ్రీ కొడుకుల ఎమోషన్, సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్‌గా నందకిశోర్ దర్శకత్వం వహించారు. సామ్రాజిత్ లంకేష్, బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షానయ కపూర్, రోషన్ మేక కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 25న మలయాళంతో పాటు తెలుగులోనూ మూవీ రిలీజ్ కానుంది.
యూత్ ఫుల్ 'బ్యాడ్ గాళ్స్'
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ గాళ్స్' 'కానీ చాలా మంచోళ్లు' అనేది ట్యాగ్ లైన్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' ఫేం డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. రేణు దేశాయ్ కీ రోల్ ప్లే చేశారు.
'పతంగ్' మూవీ
ప్రీతి పగడాల, వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్ ప్రధాన పాత్రదారులుగా నటించిన లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'పతంగ్'. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో గౌతమ్ మేనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కిచ్చా సుదీప్ 'మార్క్'
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ డ్రామా 'మార్క్'. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సుదీప్ కనిపించనుండగా... నవీన్ చంద్ర, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 25న కన్నడతో పాటు తెలుగులోనూ మూవీ రిలీజ్ కానుంది.
ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌లు
నెట్ ఫ్లిక్స్ - పోస్ట్ హౌస్ (డిసెంబర్ 22), ప్యారడైజ్ (డిసెంబర్ 24), గుడ్ బై జాన్ (డిసెంబర్ 24), ఆంధ్ర కింగ్ తాలూకా (డిసెంబర్ 25), రివాల్వర్ రీటా (డిసెంబర్ 26)
ZEE5 - ఏక్ దివానే కీ దివానియత్ (డిసెంబర్ 26)
అమెజాన్ ప్రైమ్ - సూపర్ నేచురల్ (వెబ్ సిరీస్ - డిసెంబర్ 22)