Chiranjeevi's Mana Shankara Vara Prasad Garu Movie Song Update : మెగా ఫ్యాన్స్‌కు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్. ఇద్దరు స్టార్స్ కలిసి ఓ పాటలో స్టెప్పులు వేయబోతున్నారు. ఈ విషయాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రివీల్ చేశారు. 

Continues below advertisement

త్వరలోనే సాంగ్ రిలీజ్

చిరు, అనిల్ రావిపూడి కాంబోలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేస్తుండగా... తాజాగా రిలీజ్ చేసిన ఆయన లుక్ అదిరిపోయింది. చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి డ్యాన్స్ చేసిన ఓ అద్భుతమైన పాట త్వరలోనే రిలీజ్ చేస్తామని డైరెక్టర్ అనిల్ తెలిపారు. 'శంబాల' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ అప్డేట్ ఇచ్చారు.

Continues below advertisement

చిరు, వెంకీ కలిసి ఓ మూవీలో చేస్తున్నారు అంటేనే ఓ స్పెషల్ క్రేజ్. అది పదింతలు చేసేలా ఇద్దరిదీ కలిపి ఓ సాంగ్ సినిమాలో ఉండడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : ఖైదీ To 'మన శంకర వరప్రసాద్ గారు' వరకూ - మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి... ట్రెండింగ్ AI వీడియో

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఫస్ట్ సాంగ్ 'మీసాల పిల్ల' 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. లవ్ సాంగ్ 'శశిరేఖ' సైతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ 2 పాటల్లో నయనతార, చిరంజీవి సందడి చేశారు. కానీ తాజా సాంగ్‌లో చిరు, వెంకీ కలిపి స్టెప్పులు వేయనున్నారు. ఇది మాస్ సాంగ్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది.

చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే వీటీవీ గణేష్, కేథరిన్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.