‘The 8th Night’ 2021లో విడుదలైన సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్. వేల సంవత్సరాల క్రితం రెండు వేర్వేరు పేటికల్లో బంధించి ఉన్నఅతీంద్రియ శక్తులు తిరిగి వచ్చి మనుషులందర్నీ చంపేస్తుంటే, ఒక యువ సన్యాసి దీన్ని ఆపాలని ప్రయత్నిస్తుంటాడు. రాక్షసుడికి రెడ్ ఐ, బ్లాక్ ఐ అని రెండు కళ్లు ఉంటాయి. అందులోనే ఆ రాక్షసుడి శక్తులన్నీ ఉంటాయి. అందులో రెడ్ ఐ ఏడుగురిని ఆవహించి ఎనిమిదో రోజు బ్లాక్ ఐ ని కలిసిందంటే ప్రపంచం పతనమయిపోతుంది. అది ఆపటానికి ప్రయత్నించే యువ సన్యాసి ఈ సమస్యను పరిష్కరిస్తాడా? అతనే బలి అవుతాడా? అసలు కథేమిటి? అనేది ప్రతీ క్షణం మిస్టీరియస్ గా, సీట్లకు అతుక్కుపోయి ఉత్కంఠతో చూసేలా ఉంటుంది. 


కథ విషయానికి వస్తే, ఒక రాక్షసుడు మనుషులను బాధ పెట్టడానికి నరకం నుంచి భూమ్మీదకు వస్తాడు. బుద్ధుడు ఆ రాక్షసుడి నుంచి రెడ్ ఐ, బ్లాక్ ఐలను చీలుస్తాడు. రెడ్ ఐ ఏడు రోజుల పాటు మనుషుల శరీరాల్లో దాక్కొని తప్పించుకుంటుంది. ఎనిమిదవ రోజు బుద్ధుని నుంచి తప్పించుకోవటం తన వల్ల కాదని లొంగిపోతుంది. బుద్ధుడు ఆ రెండు కళ్లను వేర్వేరు పేటికల్లో ఉంచి ఇండియా పాకిస్థాన్ బోర్డర్ వద్ద ఎడారిలో ఖననం చేస్తాడు. ఈ రెండు కళ్లూ ఎప్పటికీ కలవకూడదని బుద్ధుడు తన శిష్యులతో చెప్తాడు.


కథ తిరిగి ప్రస్తుత కాలానికి వస్తుంది. ప్రొఫెసర్ కిమ్ ఆ పేటికల ఆచూకీ తెలుసుకొని ఎడారికి బయలుదేరుతాడు. అతనో ఆర్కియాలజిస్ట్. అతను వెళ్లిన ఆ బాక్స్ తీసుకొని వచ్చి అతని పరిశోధన నిరూపించాలనుకుంటాడు. కానీ అందులో ఏమీ లేకపోవటాన్ని చూసి అతనో మోసగాడని, అతన్ని ఎవరూ నమ్మరు.  కొన్ని సంవత్సరాల తర్వాత ప్రొఫెసర్ కిమ్ , తన పరిశోధనను నిరూపించటానికి రెడ్ ఐ, బ్లాక్ ఐ రెండిటినీ కలపాలనుకుంటాడు. చంద్ర గ్రహణం రోజు మాత్రమే రెడ్ ఐ శక్తిని పుంజుకుంటుందని తెలుసుకుంటాడు. ఆ రోజున ఆరుగురి బ్లడ్స్ సాంపిల్స్ ఆ రెడ్ ఐ మీద వేస్తాడు. కానీ ఏం మార్పులేదు అని నిరాశపడేటపుడు తన బ్లడ్ సాంపిల్ ను కూడా వేస్తాడు. ఏమీ జరగదు. ఇదంతా అబద్ధమని అంతా వృథా అయిపోయిందని తను ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో రెడ్ ఐ శక్తి పుంజుకుంటుంది.


బ్లాక్ ఐ పేటికకు రక్షణగా ఉన్న వ్యక్తి రెడ్ ఐ మళ్లీ మేల్కొన్నట్లు గుర్తించి, యువ సన్యాసి అయిన చెయోంగ్‌సియోక్ కు చెప్తాడు. ఇతనే హీరో. తన గురువైన ఓల్డ్ మాంక్ చెయోంగ్‌సియోక్  ను పిలిచి అతనికి రెండు కళ్ల రాక్షసుడి గురించి చెప్తాడు. ఆ రెడ్ ఐ మేల్కొందంటే అది ఏడు రోజులు ఒక్కో రాత్రి ఒక్కో మనిషిని ఆవహించి ఎనిమిదో రోజు బ్లాక్ ఐ ని కలుస్తుంది. అలా కలవకుండా ఈ ఏడు రోజుల్లో ఏదో ఒకదాన్నైనా ఆపాలి. అపుడే ఈ ప్రమాదం తప్పుతుంది అని చెప్తాడు. పూర్వం బుద్ధుడు రెడ్ ఐ ని ఆపటానికి వర్జిన్ షమన్‌ను పంపించాడని, అదెక్కడుందో కనిపెట్టాలని అంటాడు.


ప్రొఫెసర్‌ను ఆవహించిన రెడ్ ఐ, ఒక వేటగాన్ని అటాక్ చేసి ఆవహిస్తుంది. అది ఒక జంట హోటల్‌లో చెక్ ఇన్ అయేటపుడు.. వారి వైపుకు వెళ్తుంది. ఆ మహిళ తన బోయ్ ఫ్రెండ్‌తో ఒక మెడిటేషన్ గ్రూప్ గురించి మాట్లాడుతూ అక్కడ మెడికల్ చెకప్, బ్లడ్ టెస్ట్స్ చేసుకున్నట్లు చెప్తూ ఉంటుంది. అది ప్రొఫెసర్ కిమ్ ఏర్పాటు చేసిన మెడిటేషన్ క్యాంప్. ఆ వేటగాడు ఆ జంట మీద అటాక్ చేస్తాడు. అలా ప్రొఫెసర్ ఎవరెవరి బ్లడ్ సాంపిల్స్ అయితే రెడ్ ఐ మీద వేసాడో వాళ్లందర్నీ ఆవహిస్తుంది. 


ఆ వర్జిన్ షమన్ ఎవరు? ప్రొఫెసర్ ఒక ఆత్మను ఎందుకు తయారుచేసి ఉంచాడు? వర్జిన్ షమన్ బ్లడ్ సాంపిల్ కూడా అందులో ఉంటుందా? ఆమెని కూడా రెడ్ ఐ అవహిస్తే ఈ ప్రమాదాన్ని ఎవరు ఆపుతారు? ఇలా చివరి వరకూ ట్విస్టులతో కథ సాగుతుంది. చివరికి రెడ్ ఐ హీరోని కూడా ఆవహిస్తుంది. మరి తర్వాత ఏం జరిగిందనేది తెరపై చూస్తేనే బాగుంటుంది. ఈ మూవీ ప్రస్తుతం ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.


The 8th Night Trailer:



Also Read: హైట్స్ అంటే భయమా? ఈ మూవీ చూస్తే జడుసుకుంటారు - టవర్ అంచున మృత్యుక్రీడ