గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) లో సింగర్ కూడా ఉన్నారు. 'పైసా వసూల్' సినిమాలో ఆయన పాడిన 'మామ ఏక్ పెగ్ లా' సాంగ్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సాంగ్ పాడారు. సాంగ్ అంటే సాంగ్ కాదు... ర్యాప్! అదీ 'ఆహా' ఓటీటీ సింగింగ్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' కోసం!
 
'ఆహా' ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అభిమానుల‌ను అల‌రించ‌టానికి, 'ఆహా'లో సందడి చేయడానికి ఆయన రెడీ అయ్యారు. 'తెలుగు ఇండియన్ ఐడల్ 2'లో పాల్గొన‌బోతున్న టాప్ 12 కంటెస్టెంట్లను ఆయన పరిచయం చేయనున్నారు. ఆ సందర్భంలో ర్యాప్ పాడారు. దానికి హేమచంద్ర సంగీతం అందించారు. 


''హాయ్... హలో... దిస్ ఈజ్ ఎన్.బి.కె! హే... చలో చేద్దాం... లెట్స్ రాక్! ఇది ఐడల్ చరిత్రలో బిగ్గెస్ట్ ఈవెనింగ్. ఈ సీజన్ సెట్ చేయనుంది నెవ్వర్ బిఫోర్ న్యూ ట్రెండ్! నేను మీ బాలయ్య... టాప్ 12కి మావయ్య'' అంటూ బాలకృష్ణ ర్యాప్ పాడారు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని స్టైల్లో బాల‌కృష్ణ డ్రస్సింగ్ ఉందని చెప్పాలి. 


మార్చి 17, 18 తేదీల్లో...
'ఇండియన్ ఐడల్ 2'కు బాలకృష్ణ అతిథిగా వచ్చిన ఎపిసోడ్ మార్చి 17, 18వ తేదీల్లో స్ట్రీమింగ్ కానుందని 'ఆహా' వర్గాలు తెలిపాయి. ప్రజెంట్ ఆయన పాడిన ర్యాప్ సాంగ్ వైరల్ అవుతోంది. 



ర్యాప్ పాడుతూ డాన్స్ చేయ‌టం గురించి బాల‌కృష్ణ మాట్లాడుతూ ''నా హృద‌యానికి సంగీతం ఎప్పుడూ ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. రియాలిటీ సింగింగ్ షో 'తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2' కార్య‌క్ర‌మంలో నేను భాగం కావ‌టం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. నేను ఇప్ప‌టి వ‌ర‌కు ర్యాప్ పెర్ఫామెన్స్‌ చేయలేదు. తొలిసారి ఈ కార్యక్రమంలో ర్యాప్ పాడుతూ డ్యాన్స్ చేయబోతున్నాను. ప్రేక్షకులకు ఆ ర్యాప్, డ్యాన్స్ స‌ర్‌ప్రైజింగ్ అనే చెప్పాలి. ఈ షోలో టాప్ 12 మందిని వీక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నా. వారికి సంగీతంపై నాకు ఉన్న ప్రేమ‌, అనుబంధాన్ని తెలియ‌జేస్తాను. ఆహాలో 'గాలా విత్ బాల'తో మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్‌ను సెల‌బ్రేట్ చేసుకుందాం'' అని చెప్పారు. 


టాప్ 12 కంటెస్టెంట్లు ఎవరంటే?



  1. శ్రుతి నండూరి (26) - న్యూ జెర్సీ

  2. సాకేత్ కొమ్మ జోశ్యుల (18) - హైదరాబాద్

  3. జి.వి.ఆదిత్య (21) - హైదరాబాద్

  4. చ‌క్ర‌పాణి నాగ్రి (29) - ప‌లాస

  5. అయియ్యం ప్ర‌ణ‌తి (14) - విశాఖపట్నం

  6. కార్తికేయ (16) - హైద‌రాబాద్

  7. లాస్య ప్రియ (21) - సిద్ధిపేట

  8. సౌజ‌న్య భాగ‌వ‌తుల (30) - విశాఖపట్నం

  9. సాయి వైష్ణ‌వి (27) - విజ‌య‌వాడ

  10. పైలా జయరాం (20) - హైదరాబాద్

  11. మానస (21) - హైదరాబాద్

  12. యూతి హర్షవర్ధన్ (18) - బెంగళూరు


Also Read : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్


'తెలుగు ఇండియన్ ఐడల్ 2'కు ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ (Thaman), పాపుల‌ర్ సింగర్ గీతా మాధురి, వెర్స‌టైల్ సింగ‌ర్ కార్తీక్ జ‌డ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే... మార్చి 17 నుంచి ఫేవ‌రేట్ కంటెస్టెంట్లకు ప్రేక్ష‌కులు కూడా ఓట్లు వేయ‌వ‌చ్చు. పోటీలో ఎవ‌రు ఉండాలి, ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ్లిపోవాలి అనే విష‌యంలో న్యాయ నిర్ణేత‌లులాగానే ప్రేక్ష‌కుల వేసే ఓటింగ్ కూడా కీల‌కంగా మార‌నుంది. 


Also Read : రోజుకు రెండు కోట్లు - రెమ్యూనరేషన్ రివీల్ చేసిన పవన్