పది వేల మంది... మొత్తం మీద అక్షరాలా పది వేల మంది... 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' (Telugu Indian Idol Season 2) లో పార్టిసిపేట్ చేయాలని తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు... విదేశాల నుంచి సైతం ప్రయత్నించారు. అందులో 12 మందిని ఎంపిక చేశారు. టైటిల్ కోసం వాళ్ళందరూ పోటీ పడ్డారు. ఇప్పుడు ఆ మజిలీ తుది ఘట్టానికి చేరుకుంది. తుది సమరంలో ఐదు మంది నిలిచారు. వారిలో విజేతను ఈ రోజు అనౌన్స్ చేశారు. 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' ఫినాలేకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనే విజేతను వెల్లడించనున్నారు. ఆ విజేత ఎవరో తెలుసుకునే ముందు... ఒక్కసారి టాప్ 5లో నిలిచిన ఐదుగురి జర్నీ చూసేద్దామా?


సౌజ‌న్య భాగ‌వ‌తుల... అమ్మైన తర్వాత!
'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 2లో టాప్ 5లో నిలిచిన ఓ గాయని సౌజ‌న్య భాగ‌వ‌తుల. ఆమెకు ముందు నుంచి సింగర్ కావాలని కోరిక. అయితే... పెళ్లి, పిల్లల కారణంగా పాటలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ 'తెలుగు ఇండియన్ ఐడల్ 2'తో సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆమె కుమార్తెకు రెండు నెలల్లో రెండేళ్లు పూర్తి అవుతాయి. 


ఫినాలేలో పదహారేళ్ళ కుర్రాడు కార్తికేయ!
స్కూల్ బ్యాగ్ వేసుకుని వచ్చి 'ఇండియన్ ఐడల్ 2'కు ఆడిషన్ ఇచ్చిన కుర్రాడు కార్తికేయ. అతని వయసు 16 ఏళ్ళు. హైదరాబాదీ అబ్బాయే. తెలుగు జస్టిన్ బీబర్, రాక్ స్టార్ అని బోలెడు కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. 


న్యూ జెర్సీ నుంచి వచ్చిన శృతి నండూరి!
టాప్ 5లో ఉన్న మరో అమ్మాయి శృతి. ఆమె న్యూ జెర్సీ నుంచి వచ్చారు. ఆడిషన్స్ కోసమే అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆమె సింగర్ మాత్రమే కాదు... డాక్టర్ కూడా! ఆల్రెడీ స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ పోర్టులో ఆమెకు మామూలు సంబంధాలు రావని అల్లు అర్జున్ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. శృతి నండూరి తెలుగుకు, అమెరికన్ యాక్సెంట్‌కు అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు.


ఈ ముగ్గురితో పాటు సిద్దిపేట అమ్మాయి లాస్య ప్రియ, మరో హైదరాబాదీ జయరామ్ కూడా పోటీ పడుతున్నారు. ఈ ఐదుగురిలో విజేత ఎవరు? అనేది సాయంత్రం తెలుస్తుంది. అదీ సంగతి!  


'తెలుగు ఇండియన్ ఐడల్ 2'కు ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ (Thaman), పాపుల‌ర్ సింగర్ గీతా మాధురి, వెర్స‌టైల్ సింగ‌ర్ కార్తీక్ జ‌డ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే... మార్చి 17 నుంచి ఫేవ‌రేట్ కంటెస్టెంట్లకు ప్రేక్ష‌కులు కూడా ఓట్లు వేయ‌వ‌చ్చు. పోటీలో ఎవ‌రు ఉండాలి, ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ్లిపోవాలి అనే విష‌యంలో న్యాయ నిర్ణేత‌లులాగానే ప్రేక్ష‌కుల వేసే ఓటింగ్ కూడా కీల‌కంగా మార‌నుంది. 


ఫస్ట్ గాళ్ ఫ్రెండ్... నెక్స్ట్ ఇంకేం చెబుతారో?
'తెలుగు ఇండియన్ ఐడల్ 2' ఫినాలే పార్ట్ 1 చూస్తే... అందరినీ ఆకట్టుకున్న ఓ మూమెంట్ ఉంది. అల్లు అర్జున్ తన ఫస్ట్ గాళ్ ఫ్రెండ్ శృతి అని చెప్పడం! మరి, ఫినాలేలో ఇంకెన్ని ఆసక్తికరమైన సంగతులు చెబుతారో? వెయిట్ అండ్ వాచ్ ఆహా ఓటీటీ!


Also Read : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?