Tantra Movie OTT Release Date: గత కొన్నాళ్లుగా మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తోంది ఆహా. థియేటర్లలో యావరేజ్ హిట్లుగా నిలిచిన తెలుగు సినిమాలు దాదాపుగా ఆహాలోనే విడుదల అవుతున్నాయి. అదే తోవలో మరో చిత్రం కూడా ఆహాలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది. అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ ‘తంత్ర’ ఓటీటీ రైట్స్‌ను ఆహా కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. అంతే కాకుండా ఈ మూవీ త్వరలోనే స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని స్ట్రీమింగ్ డేట్‌ను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. టాలీవుడ్‌లో చేతబడి బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధించగా.. అందులో ‘తంత్ర’ కూడా ఒకటి.


ఫస్ట్ లుక్ నుండే ఆసక్తికరంగా..


‘తంత్ర’ ఫస్ట్ లుక్ దగ్గర నుండి ఈ సినిమాలో ఏ రేంజ్ హారర్ ఉండబోతుందో హింట్స్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. అందుకే ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ కూడా వచ్చింది. హారర్ లవర్స్‌కు ఈ మూవీ గురించి తెలియడం కోసం మూవీ టీమ్ అంతా ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేసింది. వారు అనుకున్నట్టుగానే ‘తంత్ర’ గురించి కొంతవరకు ప్రేక్షకులకు తెలిసి పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. మార్చి 15న థియేటర్లలో విడుదలయిన ఈ మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఫీమేల్ ఓరియెంటెడ్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ‘తంత్ర’ను శ్రీనివాస్ గోపిశెట్టి డైరెక్ట్ చేశారు. వరుసగా చేతబడి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ప్రేక్షకులను భయటపెట్టిన తెలుగు సినిమాల లిస్ట్‌లో ‘తంత్ర’ కూడా యాడ్ అవ్వగా.. ఇప్పుడు ఇదే మూవీ ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తోంది.


మరో హారర్ చిత్రం..


‘తంత్రం మంత్రం కుతంత్రం.. ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం!’ అంటూ ‘తంత్ర’ ఓటీటీ రిలీజ్‌ను ప్రకటించింది ఆహా. ఏప్రిల్ 5 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని బయటపెట్టింది. ఇప్పటికే ఆహాలో పలు తెలుగు హారర్ చిత్రాలు సబ్‌స్క్రైబర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుండగా.. అందులో ‘తంత్ర’ కూడా యాడ్ అవ్వనుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్లకు జోడీగా ధనుష్ రఘుముద్రి నటించాడు. ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోని.. చాలాకాలం తర్వాత ‘తంత్ర’తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సలోని.. అందరినీ భయపెట్టింది. లక్ష్మణ్ మీసాల, మనోజ్ ముత్యం, శరత్ బరిగెలా, కుషాలినీ కూడా ఈ మూవీలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.






అన్నీ తక్కువ బడ్జెట్ సినిమాలే..


‘వకీల్ సాబ్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు నో చెప్పి హీరోయిన్‌గానే బిజీ అయిపోయింది. తక్కువ బడ్జెట్ సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది అనన్య. ప్రస్తుతం తన చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉండగా.. అవన్నీ తక్కువ బడ్జెట్ సినిమాలే. కొత్త కథలకే ప్రాధాన్యత ఇచ్చే అనన్య కెరీర్‌లో నటించిన మొదటి హారర్ చిత్రమే ‘తంత్ర’. ఇందులో ఒకప్పటి తాంత్రిక శక్తుల గురించి, వాటి వల్ల జరిగే నష్టాల గురించి దర్శకుడు వివరించాడు. న‌రేశ్ బాబు, ర‌వి చైత‌న్య ఈ మూవీకి ప్రొడ్యూస‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు. 


Also Read: 'తలైవర్ 171' నుండి ఆసక్తికర అప్డేట్ - అలాంటి పాత్రలో రజినీకాంత్!