కోలీవుడ్ కమెడియన్ కమ్ హీరో సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ చిత్రం 'డీడీ రిటర్న్' (డేర్ డెమాన్స్ రిటర్న్స్). ఇది 2016లో వచ్చిన 'దిల్లుకు దుడ్డు 2' మూవీకి సీక్వెల్. 'దిల్లుకు దుడ్డు' ఫ్రాంచైజీలో మూడవ చిత్రంగా రూపొందింది. నూతన దర్శకుడు ప్రేమ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా, తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'DD రిటర్న్స్: భూతాల బంగ్లా' గా రిలీజ్ చేసారు. కానీ ఇక్కడ పెద్దగా ఆడలేదు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.
'DD రిటర్న్స్' సినిమా తమిళ నాట జూలై 28న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో 'డీడీ రిటర్న్స్ - భూతాల బంగ్లా' పేరుతో ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలో తమిళ వెర్షన్ ను జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేసారు కానీ, తెలుగు వెర్షన్ ను మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే ఇప్పుడు తెలుగులోనూ ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!
ZEE5 ఓటీటీలో 'DD రిటర్న్స్' చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఫాస్టెస్ట్ 200+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. లేటెస్టుగా తెలుగులో అందుబాటులోకి వచ్చిన 'డీడీ రిటర్న్స్ - భూతాల బంగ్లా' కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆయన సంతానం సరసన సురభి హీరోయిన్ గా నటించింది. రెడిన్ కింగ్ స్లే, ప్రదీప్ రావత్, రాజేంద్రన్ ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. సంతానం తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. రొటీన్ హారర్ కామెడీ మూవీ అయినప్పటికీ, ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మాత్రం మంచి అనుభూతినిస్తుంది.
'DD రిటర్న్స్ - భూతాల బంగ్లా' కథేంటంటే...
కొందరు స్నేహితులు తాము దొంగిలించిన కోట్లాది రూపాయల డబ్బు మరియు నగలను ఓ బ్యాగ్ లో పెట్టి, పోలీసుల కంట పడకుండా ఓ భూతాల బంగ్లాలో దాచిపెడతారు. ఆ బ్యాగ్ ను తిరిగి బంగ్లా నుంచి తీసుకొచ్చే ప్రయత్నించినప్పుడు వారికి ఒక దెయ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన పరిణామాలను ఆద్యంతం వినోదాత్మకంగా 'డీడీ రిటర్న్స్' (డేర్ డెమాన్స్ రిటర్న్స్) సినిమాలో చూపించారు.
'డిడి రిటర్న్స్ - భూతాల బంగ్లా' చిత్రాన్ని ఆర్‌కె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు. దీనికి ఆఫ్ రో సంగీతం సమకూర్చారు. తమిళ్ లో చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం సాధించింది. దాదాపు 12 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే, అంచనాలకు మించి రూ. 40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial