టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ.. బాలీవుడ్ కి వెళ్లిన తరువాత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎన్నుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. ఇటీవల ఆమె నటించిన 'హసీనా దిల్ రుబా', 'అనబెల్ సేతుపతి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.
తాజాగా తాప్సీ నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేసిన 'రష్మీ రాకెట్' అనే సినిమాలో నటించిన తాప్సీ. ఈ సినిమాలో ఆమె గుజరాత్ అథ్లెట్ రష్మీ పాత్రలో కనిపించనుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను వచ్చే నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా థియేటర్లలో సినిమాను విడుదల చేసే అవకాశం లేకపోవడంతో.. ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.
రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో తాప్సీ మూడు రకాల లుక్స్ లో కనిపించనున్నారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిగా.. ఆ తర్వాత అథ్లెట్‌గా నేషనల్‌కు సెలెక్ట్ అయిన క్రీడాకారిణిగా.. అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే ప్లేయర్ గా.. ఇలా మూడు లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు తాప్సీ.